బ‌జార్ రౌడి చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ లో

Published On: March 8, 2021   |   Posted By:

బ‌జార్ రౌడి చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ లో

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కి ముస్తాబ‌వుతున్న బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు “బ‌జార్ రౌడి” 


హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట‌, వైర‌స్, సింగం123 లాంటి విభిన్న‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని ప్ర‌పంచం లో వున్న తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో స్ధానం సంపాయించిన బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వ‌స్తున్న చిత్రం బ‌జార్ రౌడి.
 
 
ఈ చిత్రానికి సంబందించి మెద‌టి లుక్ మ‌రియు మెష‌న్ పోస్ట‌ర్ ని గ్రాండ్ గా విడుదల చేశారు. కామ‌న్ ఆడియ‌న్ నుండి సోష‌ల్ మీడియా ఆడియ‌న్ వ‌ర‌కూ ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకొవ‌టం చిత్ర యూనిట్ కి మ‌రింత ఉత్సాహ‌న్ని ఇచ్చింది.  
 
 
ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.
 
 
కె ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో రూపోందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డి వ‌సంత నాగేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వ బాద్య‌త‌లు నిర్వ‌హించారు. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న మ‌హేశ్వ‌రి వ‌ద్ది హీరోయిన్ గా చేస్తుంది.
 
అతి త్వ‌ర‌లో టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. సంపూర్ణేష్ బాబు హీరోగా చేస్తున్న బ‌జార్ రౌడి చిత్రం అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో నిర్మాత‌ సందిరెడ్డి శ్రీనివాస‌రావుగారు అద్బుత‌మైన స‌పోర్ట్ తో  షూటింగ్ ని పూర్తిచేశాము. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాము. ఈ చిత్రానికి      బ‌డ్జెట్ విష‌యం లో ఎక్క‌డా లిమిటేష‌న్ పెట్ట‌కుండా చిత్రాన్ని నిర్మిస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ శేఖ‌ర్ గారు త‌న అనుభ‌వం తో ఎక్క‌డ ఖ‌ర్చుపెడితే స్క్రీన్ మీద క‌న‌బ‌డుతుందో చ‌క్క‌టి ప్లానింగ్ తో మా అంద‌రికి స‌పోర్ట్ గా నిలిచారు. మాకు ఈ లోకేష‌న్ కావాలి, ఈ ఆర్టిస్ట్ కావాలి అంటే ఏమాత్ర ఆలోచించ‌కుండా శేఖ‌ర్ గారు మాకు అందించారు కాబ‌ట్టే ఈ చిత్రం ఇంత భారీ తారాగాణం తో తెర‌కెక్కింది. అలాగే మా హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్ది త‌న పాత్ర‌లో ఇమిడిపోయారు. అలాగే  ఈ చిత్రం లో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో షియాజి షిండే, థ‌ర్ఠి ఇయ‌ర్స్ పృథ్వి, నాగినీడు,ష‌ఫి, జీవ‌, స‌మీర్‌, మణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి లాంటి భారీతారాగాణం తో ఎక్క‌డా ఏమాత్ర చిన్న ఇబ్బంది కూడా లేకుండా తెర‌కెక్కించాము. రీసెంట్ గా విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ కి వ‌చ్చిన రెస్పాన్స్ కి మా బిజినెస్ కూడా ఊపందుకుంది. అలాగే ఈ చిత్రం యోక్క టీజ‌ర్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాము. సాయికార్తిక్ అందించిన ఆడియె ని గ్రాండ్ గా విడుద‌ల చేస్తాం. ఈ స‌మ్మ‌ర్ లో మా బజార్ రౌడి విడుల‌కి ముస్తాభ‌వుతుంది. అని అన్నారు

న‌టీ న‌టులు..
బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు
నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు
మాట‌లు: మ‌రుధూరి రాజా
సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌
సంగీతం: సాయి కార్తిక్‌
ఎడిటర్: గౌతం రాజు
ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా