భామాకలాపం 2 మూవీ స్వప్న సుందరి పాట విడుదల

Published On: February 6, 2024   |   Posted By:

భామాకలాపం 2 మూవీ స్వప్న సుందరి పాట విడుదల

భామాకలాపం 2 నుంచి స్వప్న సుందరి పాటను విడుదల చేసిన సీరత్ కపూర్.. వైజాగ్ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌లో ఘనంగా జరిగిన ఈవెంట్

ఫిబ్రవరి 4, హైదరాబాద్: వైజాగ్ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌లో ప్రముఖ హీరోయిన్ సీరత్ కపూర్ సందడి చేసింది. భామాకలాపం 2 నుంచి స్వప్న సుందరి.. అనే పాటను ఆమె విడుదల చేశారు. అందరిలో ఆసక్తిని పెంచిన భామాకలాపం 2 సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా వైజాగ్ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో సీరత్ కపూర్ పాల్గొని పాటను విడుదల చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. పాట విషయానికి వస్తే సినిమాకు సంబంధించిన విషయాన్ని ఈ పాట ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. పొగలు కమ్మినట్లుగా క్లబ్‌లో ఉండే ప్రత్యేకమైన వాతావరణంలో పాటను చిత్రీకరించారు. సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ఈ పాట ప్రేక్షకులకు భామాకలాపం 2 చిత్రం ఓ ఆకట్టుకునే సినిమా అనుభవాన్ని అందిస్తుందనే భావనను కలిగించింది.

చీకటిగా ఉంటూ పొగ కమ్మేసినట్లుండే వాతావరణంలో.. క్లబ్‌లో ప్రత్యేకమైన సెట్టింగులో స్వప్న సుందరి.. పాటను చిత్రీకరించారు. మరీ ముఖ్యంగా సీరత్ కపూర్ డాన్సింగ్ టాలెంట్ ఈ పాట ఆవిష్కరించటమే కాకుండా భామాకలాపం 2 విడుదలకు సంబంధించిన వేదికగా నిలిచింది. క్లబ్‌లోని చీకటి, ఏదో తెలియని రహ్యం ఉన్న పరిస్థితులు అక్కడున్నాయని చెబుతూ సీరత్ కపూర్ నటనలో కొత్తదనాన్ని పరిచయం చేసింది. దీంతో భామాకలాపం 2 మూవీని చూడటానికి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
గాయి. కామెడీ, సస్పెన్స్ కలయికతో ప్రియమణి, సీరత్ కపూర్ అద్భుతమైన పెర్ఫామెన్స్‌లతో చక్కటి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను భామాకలాపం 2తో కచ్చితంగా పొందుతామనే భావన ఆడియెన్స్‌లో కలిగిందనటంలో సందేహం లేదు. అభిమానులు SwapnaSundariLaunch అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాటపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. అలాగే భామాకలాపం 2పై కూడా చర్చకు ఇతరులను ఆహ్వానిస్తున్నారు.

సీరత్ కపూర్ డాన్స్ పెర్ఫామెన్స్ చేసిన స్వప్న సుందరి పాట ఇప్పుడు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయటానికి సిద్ధంగా ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న భామాకలాపం 2 చిత్రాన్ని దానికి సంబంధించిన మ్యూజికల్ జర్నీని మిస్ అవ్వకండి.