భీమా చిత్రం ది రేజ్ అఫ్ భీమా విడుదల

Published On: March 8, 2024   |   Posted By:

భీమా చిత్రం ది రేజ్ అఫ్ భీమా విడుదల

మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ‘భీమా’ నుంచి పవర్ ప్యాక్డ్ ‘ది రేజ్ అఫ్ భీమా’ విడుదల

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా.  ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు.  టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది.

తాజాగా మేకర్స్ ‘ది రేజ్ అఫ్ భీమా’ ట్రాక్ ని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ రవి బస్రూర్ పవర్ ప్యాక్డ్ ట్రాక్ గా స్వరపరిచారు. హై ఎనర్జిటిక్ బీట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. రవి బస్రూర్, సంతోష్ వెంకీ  లిరిక్స్ అందించడంతో పాటు హై ఆక్టేన్ వోకల్స్ పాడారు. భీమా క్యారెక్టర్ పై చిత్రీకరించిన ఈ పాటలో హై పవర్డ్ అవతార్ లో అలరించారు గోపిచంద్.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమా మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్