మధుర వైన్స్ మూవీ రివ్యూ

‘మధుర వైన్స్’ సినిమా రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) :

 👎

కొన్ని సినిమా టైటిల్స్ ఉట్టినే టెమ్ట్ చేస్తాయి. ఏదో విషయం ఉంది అనేలా ఉంటాయి. దానికి తగ్గట్లు ప్రోమోలు పడ్డాయా..ఇంక జనంలో క్యూరిటీసిటీ పెరిగిపోతుంది. చిన్న సినిమాలకు ఈ స్ట్రాటజీనే చాలా సార్లు ప్లస్ అవుతుంది. అలాగని జనం ఎగబడి వెళ్లిపోరు. ఓ కన్నేసి ఉంచుతారు. బాగుందని టాక్ వచ్చిందా..హిట్ చేసే దాకా నిద్రపోరు. అయితే అలాంటివి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇప్పుడు ఈ సినిమా మధురవైన్స్ కూడా సేమ్ టు సేమ్ జనాలకు సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడేలా. వాటిని ఈ మేకర్స్ ఎంతవరకూ రీచ్ అయ్యేలా సినిమా తీసారు. సినిమా కథేంటి…కిక్కు ఎక్కే సబ్జెక్టేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అజయ్(సన్నీ నవీన్)కి  ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పటంతో మందుకి బానిసై, మధురా వైన్స్ లో సెటిల్ అవుతాడు. ఇక మధురా వైన్స్ ఓనర్ ఆనంద్ రావు (సమ్మోహిత్ ములూరి) తో ప్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆనందరావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి.. తనకు ఇష్టం లేని మద్యం వ్యాపారంలోకి దిగి మధుర వైన్స్ రన్ చేస్తూంటాడు. మధురవైన్స్‌లో పర్మనెంట్ దుకాణం పెట్టేసిన అజయ్ ని అంజలి(సీమా చౌదరి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అంజలికి తాగుబోతులంటే ఇష్టం లేకపోయినా అజయ్ నిజాయితీ నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. మెల్లిగా అజయ్ కూడా ప్రేమలో పడుతాడు. ఫుల్ ఖుషీగా ఉంటాడి. తన జీవితం మారిపోయినట్లు భావిస్తాడు. ఇంతకీ  అంజలి మరెవరో కాదు ఆనందరావు చెల్లెలే.  ఓరోజు అజయ్, అంజలి ప్రేమ వ్యవహారం ఆనంద్ రావుకు తెలుస్తుంది.  అప్పుడు వీరి ప్రేమకు  ఆనంద్ రావు నో చెప్తాడు. మరి  అంజలితో ప్రేమ విషయంలో ఆనందరావును అజయ్ ఒప్పించాడా? చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే మధురవైన్స్ సినిమా కథ.


స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

ఈ సినిమా చూస్తూంటే ఆ మధ్య కార్తికేయ హీరోగా వచ్చిన 90ఎమ్ ఎల్ సినిమా స్టోరీ లైన్ గుర్తు వస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ తన తాగి ఊగే వైన్స్ ఓనర్ చెల్లెలే తన లవర్ అవ్వటం. ఇందులో పెద్దగా కాంప్లిక్ట్ కొత్తగా కనిపించదు. చాలా థిన్ స్టోరీ లైన్. దాంతో సెకండాఫ్ సీన్స్ బలవంతంగా లాగాల్సి వచ్చింది తప్పించి..సజావులుగా వాటంతట అవి నాచురల్ గా నడవవు. ఇక ఫస్టాఫ్‌లో అజయ్, అంజలి రొమాంటిక్ సీన్లే తప్ప ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్  ఏమీ కనపించవు. స్టోరీని ముందుకు డ్రైవ్ చేసే అంశాలు కనపడక, కథ ప్రెడిక్టబుల్ గా  సాగి  ఆసక్తి తగ్గిపోతుంది. అయితే డైరక్టర్ ఈ కథను ఎమోషనల్ గా డీల్ చేయాలని భావించి సీన్స్ చేసాడని అర్దమవుతుంది. కానీ ఎమోషన్స్ మొదట్లో బాగానే అనిపించినా రాను రాను బోర్ కొట్టేసాయి. దానికి తోడు సినిమా మొత్తం అజయ్, ఆనంద రావు, అంజలి మధ్యనే సాగి..ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ట్విస్ట్ గా అనుకున్న తన వైన్ షాప్ ఓనర్ చెల్లే తన లవర్ అనేది కూడా పేలలేదు. ఏదైమైనా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అయినప్పటికీ.. సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ గా బోరింగ్ గా సాగటంతో మొత్తం ఇంపాక్ట్ పోయింది. ట్రీట్మెంట్ సరిగ్గా రాసుకుని స్క్రీన్ ప్లేతో నడిపిస్తే ఇంత నాశిరకంగా ఉండకపోను.

టెక్నికల్ గా

ఈ సినిమాలో చెప్పుకోదగింది ఏమైనా ఉందీ అంటే అవి డైలాగ్స్ . కానీ అవి కథను డామినేట్ చేయడం మొదలయ్యి…చాలా సీన్స్ ని చంపేసింది. సెకండాఫ్ లో వచ్చే సీన్స్ లలో బ్యాలెన్స్ తప్పింది. సీన్స్ బాగుంటే ఆ డైలాగుకు కలిసొచ్చేది. అలా కాకపోవటంతో క్యారక్టర్స్  ఆ భారమైన డైలాగ్స్ పలకడం అసమంజసంగా అనిపిస్తుంది. మందుబాబులకి ఇతను రాసుకున్న డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. డైరక్టర్ గా చూస్తే టేకింగ్ పరంగా ఎఫర్ట్ సరిపోలేదు. ఇక కార్తిక్, జయ్ క్రిష్ ల సంగీతం,ముఖ్యంగా రీరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో  లెంగ్త్ ఎక్కువైన ఫీల్ ని పోగొట్టేలా 15 నిముషాలైనా ట్రిమ్ చేయాల్సింది. అలా చేయకపోవటంతో సినిమాలో ఫీల్ పోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది  కానీ ..కొన్ని కొన్ని సీన్లలో మాత్రం షార్ట్ ఫిలిం చూస్తున్నామనిపించింది.  మధుర వైన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్  బాగున్నాయి.

 నటీనటులు విషయానికి వస్తే.. అజయ్ పాత్రని సన్నీ చాలా ఈజ్ తో పోషించాడు. మద్యానికి బానిసైపోయిన కుర్రాడిగా మంచి నటన కనపరిచాడు. కానీ అతని ఇంటర్నల్ కాంప్లిక్ట్  ఏంటన్నది అర్దం కాలేదు.సీమా చౌదరి చూడటానికి బాగుంది కానీ నటనలో పరిణితి లేదు. సమ్మోహిత్ తుమ్మలూరి నేచురల్ పెర్ఫార్మన్స్ .అ లీలా వెంకటేష్, అల్లు రమేష్, హరీష్ రోషన్ వంటి వారి పాత్రలు ఓకే అనిపిస్తాయి.

చూడచ్చా
డైలాగ్స్, అక్కడక్కడా వచ్చే రొమాంటిక్ ఎలిమెంట్స్ ని  ఆస్వాదించాలనుకొంటే మధుర వైన్స్‌ లో అడుగు పెట్టచ్చు.

తెర ముందు వెనక..
బ్యానర్: ఆర్ కే సినీ టాకీస్
 నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరీ, సమ్మోహిత్ తూములూరి తదితరులు
సినిమాటోగ్రాఫర్: మోహన్ చారి
సంగీతం: కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్
ఎడిటర్: వర ప్రసాద్
కథ, దర్శకత్వం: జయకిషోర్ బీ
నిర్మాతలు: రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు
 సహ నిర్మాత: సాయి శ్రీకాంత్ తెరువు
రన్ టైమ్: 2 గంటల 3  నిముషాలు
రిలీజ్ డేట్: 2021-10-22