మధూ నెక్కంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు
 
బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
 
బెజవాడ లో పుట్టి ఉన్నత చదువులు చదివి అమెరికా లో సెటిల్ అయి, నటిగా, గాయని గా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, తన సోషల్ మీడియా ప్లాటుఫారం పై కొంటె వీడియో లతో ఎందరికో వినోదాన్ని పంచుతున్న మధూ నెక్కంటి అలియాస్ బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
 
అమెరికా పౌరసత్వం పొందిన కూడా తెలుగు భాష పై మక్కువతో తిరుగు ప్రయాణం పట్టారు. తన ఒక్క గాయనిగా, నటిగా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. 24 కిస్సెస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఏబీసీడీ ఇలా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని మేపించారు. జీ 5 ఓ టి టి లో విడుదల అయిన షూట్ అవుట్ ఎట్ ఆలేర్ వెబ్ సిరీస్ లో హీరో  శ్రీకాంత్ గారికి భార్య గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
తనని అందరు బెజవాడ బెబక్కాయ్ గా పిలుస్తారు. బెజవాడ బెబక్కాయ్ అంటే పేరు కాదు అది ఒక్క బ్రాండ్. ఆ పేరు కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాను చేసే చిన్న చిన్న వీడియో లకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కరోనా లాక్ డౌన్ సమయం లో బెజవాడ బెబక్కాయ్ తన తుంటరి వీడియో లతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. 
 
ప్రేస్తుతానికి మన బెజవాడ బెబక్కాయ్ నరేష్ గారు నటిస్తున్న అందరు బాగుండాలి అందులో నేనుండాలి చిత్రం మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, మారుతీ గారి దర్శకత్వం లో ఒక సినిమా, ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా మరియు ఆహా కళ్యాణం వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 
 
మే 30 న మధూ నెక్కంటి పుట్టిన రోజు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ “నన్ను నటిగా, గాయని గా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న అందరికి నా ధన్యవాదాలు. తన తెలుగు లో కమెడియన్ లు చాలా మంది ఉన్నారు కానీ ఫి మేల్ కమెడియన్ ఎవరు లేరు. ఆ స్థానాన్ని నేను పూర్తి చేదాం అనుకుంటున్న. నాకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి, నన్ను అందరు ఆదరిస్తారు అని భావిస్తున్న. ఇప్పటిలాగే మరిన్నో వీడియో లతో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను” అని తెలిపారు.