మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: January 30, 2024   |   Posted By:

మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 23న ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రం విడుద‌ల

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌తో పాటు చిత్ర విడుద‌ల తేదిని సోమ‌వారం ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌న‌టుడిగా, స‌హాయ నటుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న అభిన‌వ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, న‌టుడిలోని మ‌రో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జంగా ఆక‌ట్టుకునే విధంగా వుంటుంది. కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

నటీనటులు :

త‌రుణ్‌భాస్క‌ర్‌, అలీ రేజా, మొయిన్‌, చ‌క్ర‌పాణి ఆనంద్‌, నిళ‌గ‌ల్ ర‌వి, జ్యోతి రెడ్డి, లావ‌ణ్య రెడ్డి, శ్వేత అవ‌స్థి, ర‌వీంద‌ర్ రెడ్డి, సూర్య‌, రాకెట్ రాఘ‌వ, సాయిక్రిష్ణ‌, ఫ‌ణి చంద్ర‌శేఖ‌ర్

సాంకేతిక వర్గం :

కెమెరా:సిద్దార్థ స్వ‌యంభూ
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
సంగీతం: సంజీవ్ టి
ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల‌