మహా రాగ్ని చిత్రం టీజర్ విడుదల

ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు నటిస్తునారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడులైంది.

టీజర్ మొదటి షార్ట్ నుంచి చివరి షాట్ వరకు అత్యంత ఉత్కంఠంగా రంజింపజేసింది. ఈ టీజర్ లో ముఖ్యంగా ప్రధాన క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీనే అద్భుతంగా ఉంది. జాతరలో ఫైట్ చేసే సీన్, తాను చెప్పే డైలాగ్ గూజ్ బమ్స్ తెప్పిస్తున్నాయి. మహా రాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్ అశేష ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ చిత్రానికి పనిచేసిన జీకే విష్ణు మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ లో ఆయన పనితనం గొప్పగా ఆవిష్కరించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి వెన్నుముక అనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. గూస్ బంప్స్ తెప్పించే బిజిఎం అందించాడు. టీజర్ కట్ చేసిన విధానం కూడా కట్టిపడేసింది. ఈ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి పనితనం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరో బ్రహ్మాండమైన అప్డేట్ వెలువలనుందని సమాచారం.

నటీనటులు :

కాజోల్, ప్రభుదేవ, నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు

సాంకేతిక వర్గం :

కథదర్శకత్వం: చరణ్ తేజ్ ఉప్పలపాటి
స్క్రీన్ ప్లే: నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా
నిర్మాత: వెంకట అనిష్ దొరిగిల్లు
బ్యానర్: E7, బవెజ స్టూడియోస్
సినిమాటోగ్రాఫర్: జి కె విష్ణు
ఎడిటర్: నవీన్ నూలి