మామా మశ్చీంద్ర మూవీ పాట విడుదల

Published On: September 19, 2023   |   Posted By:

మామా మశ్చీంద్ర మూవీ పాట విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు, హర్షవర్ధన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మామా మశ్చీంద్ర అడిగా అడిగా పాట విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్-ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ మామా మశ్చీంద్ర తో వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ అడిగా అడిగా అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ హృదయాన్ని హత్తుకునే అమ్మ పాటను స్కోర్ చేశారు, ఈ పాట వినగానే భావోద్వేగానికి గురి చేస్తుంది, అమ్మతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. గీత రచయిత చైతన్య ప్రసాద్ భావోద్వేగాలను చాలా అద్భుతంగా వ్యక్తీకరించారు. పాటలో శ్రీనివాసన్ దొరైస్వామి వాయిస్ మరింత ఆకర్షణీయంగా మారింది. విజువల్స్ కూడా అంతే ప్లజంట్ గా ఉన్నాయి.

టీజర్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, రెండవ సింగిల్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది.

ఈ చిత్రానికి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.

మామా మశీంద్ర అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది.

తారాగణం :

సుధీర్ బాబు, మిర్నాళిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీవోపీ: పీజీ విందా