మిషన్‌ మజ్ను మూవీ రివ్యూ

Published On: January 21, 2023   |   Posted By:

మిషన్‌ మజ్ను  మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

థియోటర్ కోసం రెడీ చేసిన సినిమా ఓటిటిలో రిలీజ్ అయితే అది మిషన్‌ మజ్ను అవుతుంది. ఫిక్షనల్‌ స్పైథ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు మన తెలుగులో పాపులర్ అయిన రష్మిక నటించింన చిత్రం కావటంతో మనవాళ్ల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. ఇంతకీ రష్మిక రెండో బాలీవుడ్ సినిమా అయినా విజయం సాధించిందా అసలు ఈ చిత్రం కథేమిటి . ఈ స్పై థ్రిల్లర్ లో రష్మిక పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అప్పట్లో అంటే 1970 లలో లాఫింగ్‌ బుద్ధ పేరుతో మన భారతదేశం అణుబాంబును పరీక్షిస్తుంది. ఇది యాజ్ యూజువల్ గా మిగతా ప్రపంచదేశాలకు మండిపోతుంది. మన దాయాది దేశం పాకిస్థాన్‌కు ఈ మంట కాస్త ఎక్కువగా ఉంటుంది. భారత్ అణుబాంబు ప్రయోగం తమకు ముప్పుగా భావించిన పాకిస్దాన్ అక్రమంగా ఓ న్యూక్లియర్‌ బాంబును తయారు చేయడం మొదలుపెడుతుంది ఆ ప్లేస్ ని చాలా సీక్రెట్ గా ఉంచుతారు ఈ పని కోసం పాకిస్తాన్ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ (మీర్ సర్వర్) పనిచేస్తూంటారు. RAW దగ్గరకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో ఆ అణు కేంద్రం ఉన్న ప్రదేశం గురించి తెలుసుకోవడానికి మరియు దానిని న్యూట్రలైజ్ చేయడానికి గూఢచారి ఏజెంట్ తారిక్ అలియాస్ అమన్‌దీప్ అజిత్‌పాల్ సింగ్ (సిద్దార్థ్ మల్హోత్రా)ని నియమిస్తుంది అయితే, రా లో ఓ అధికారి మాత్రం దేశద్రోహి కొడుకు అంటూ అమన్ దీప్ ని అవమానిస్తుంటాడు.ఈ క్రమంలో తన మిషన్ మీద బయిలుదేరిన అమన్ దీప్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడా? ఆ జర్నీలో అతనికి ఎదురైన ఛాలెంజ్ లు ఏమిటి? మధ్యలో అంధురాలు నస్రీన్ (రష్మిక) ఎవరు? ఆమెతో అమన్ దీప్ ప్రేమ, పెళ్లి మేక్ ఏమిటి? అతడి ప్రయాణానికి నస్రీన్ ఏ విధంగా సహాయ పడింది? అనేది డిజిటల్ స్క్రీన్ మీద సినిమా చూసి తెలుసుకోవాలి. తారిక్ సీక్రెట్ ప్లేస్ ని ఎలా కనుగొంటాడు? చివరకు పాకిస్థాన్‌ తయారు చేస్తున్న న్యూక్లియర్‌ బాంబు స్థావరాన్ని తారీఖ్‌ కనిపెట్టాడా? వంటి విషయాలు తెలియాలంటే మిషన్‌ మజ్ను (Mission Majnu) చూడాల్సిందే.

స్క్రీ న్ ప్లే విశ్లేషణ

టైటిల్,స్టోరీ లైన్ విని ఏదో పెద్ద స్పై థ్రిల్లర్ చూద్దామని ఫిక్స్ అయితే మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది. అందుకు కారణం స్పై థ్రిల్లర్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ఏమీ ఈ సినిమా స్క్రిప్టులో లేకపోవటమే అందులోనూ ఇది నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తయారు చేసుకున్న కథ. ఇంటర్నెట్ లో ఈజిగా దొరికే ఇన్ఫర్మేషన్ నిబేసే చేసుకుని రాసుకున్నట్లు అర్దమవుతుంది. అంతేకానీ ప్రత్యేకమైన రీసెర్చ్ వర్క్ కనపడదు అలాగే ట్విస్ట్ లు, టర్న్ లు కూడా పెట్టుకోలేదు దానికి తోడు సినిమాలో క్యారక్టర్స్,కాస్ట్యూమ్స్ అన్నీ స్టీరియోటైప్ లో ఉండటం విసుగ్గా అనిపిస్తుంది. అక్షయ్ కుమార్ బేబీ, ఆలియా భట్ రాజీ వంటి ఈ జానర్ సినిమాలు నెక్ట్స్ లెవిల్ లో ఉంటాయి. అలాగే కథలో హీరోకు పర్శనల్ అజెండా కలిపారు ఓ సీన్ లో దేశద్రోహి కొడుకును నమ్మడం ఎలా? అతడి చేతిలో మిషన్ పెట్టడం తప్పు అని ఒకరు సందేహం వ్యక్తం చేస్తే తండ్రి చేసిన తప్పుకు కొడుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాడు అతడిని ఎంపిక చేయడానికి అంత కంటే మంచి కారణం ఏం ఉంటుంది? అని రా హెడ్ చెబుతాడు అది మనకు రీసెంట్ గా కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ ని గుర్తు చేస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ లో వెలుగుతున్న ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై లు చేసిన సల్మాన్ తరహా యాక్షన్ సీక్వెన్స్ కు కూడా చోటు ఇవ్వలేదు.అవన్ని వదిలేసి మజ్ను టైటిల్ పెట్టినందుకు అటు లవ్ స్టోరీకి న్యాయం చేయలేదు.అందుకేనేమో థియేటర్ రిలీజ్ ఆపి ఓటిటికి వదిలారు అనిపిస్తుంది. ఏదైమైనా సినిమా స్టోరీలైన్ కు సరపడ స్క్రిప్టు మాత్రం కాదు. అందుకే ఓకే ఓకే గా నడిచిపోతుంది.

హైలెట్స్

పాత్రని పండించిన సిద్ధార్థ్‌ మల్హోత్ర,
అక్కడక్కడా వచ్చే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌
క్లైమాక్స్

మైనస్ లు

ఎన్నో సార్లు చూసేసిన రొటీన్‌ స్పై డ్రామా,
ప్లాట్ గా సాగిన దర్శకత్వం

నటీనటుల్లో

ఈ చిత్రం సిద్ధార్థ్‌ మల్హోత్ర వన్ మ్యాన్ షో సిద్ధార్థ్‌ మల్హోత్ర తనదైన గ్రేస్ తో అలరించాడు తన పాత్రలో ఒదిగిపోయాడు సిద్ధార్థ్‌ లుక్, యాక్షన్ స్టయిల్ అభిమానుల్ని అలరిస్తాయి. రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఉన్నంతలో ఆమె సీన్స్ ఆకట్టుకుంటాయి మిగతా పాత్రధారులు పరిధిమేర నటించారు అక్కడక్కడా డబ్బింగ్ కు తెలుగు టైమింగ్ సరిగ్గా కుదరలేదు.

టెక్నికల్ విషయాలకి వస్తే

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హెవీగా వుంది నిజానికి అంత అవసరం లేదని కొన్ని సీన్స్ అనిపిస్తాయి దాదాపు సినిమా అంతా సౌండ్ వినిపిస్తూనే వుంటుంది. బిజితేష్ దే కెమరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ విజువల్స్ రిచ్ గా వున్నాయి తెలుగు డబ్బింగ్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది ఒక్క పాట కూడా గుర్తుండదు థ్రిల్లింగ్ సీన్స్ హాఫ్ బేకెడ్ గా ఉన్నాయి దర్శకుడుగా శాంతను బగ్చి తొలి చిత్రం అనుకున్న స్దాయిలో ప్రతిభావంతంగా తీయలేకపోయారు డైలాగులు సోసోగా, చాలా జనరిక్ గా ఉన్నాయి ఎడిటింగ్ ఓకే నిర్మాణ విలువలు బావున్నాయి.

చూడచ్చా

స్పై థ్రిల్లర్ గా కాకుండా చూస్తే కాలక్షేపానికి ఓకే అనిపిస్తుంది. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే ఇబ్బందిపెడుతుంది.

నటీనటులు :

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మికా మందన్నా, పర్మీత్ సేథీ, షరీబ్ హష్మీ, మీర్ సర్వార్, కుముద్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, రజత్ కపూర్ తదితరులు

సాంకేతికవర్గం :

కథ : పర్వీజ్ షైక్, అసీమ్ అరోరా
స్క్రీన్ ప్లే : సుమిత్ భతేజా, పర్వీజ్ షైక్, అసీమ్ అరోరా
మాటలు : సుమిత్ భతేజా
ఛాయాగ్రహణం : బిజితేష్ దే నిర్మాతలు : రోనీ స్క్రూవాలా, అమర్, గరిమా మెహతా
దర్శకత్వం : శాంతను బగ్చి
విడుదల తేదీ: జనవరి 20, 2023
రన్ టైమ్: 129 మినిట్స్
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్‌