మోస‌గాళ్లు చిత్రం జూన్ విడుద‌ల
 
జూన్ 5న విడుద‌ల కానున్న మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’

మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న హాలీవుడ్‌-ఇండియ‌న్ ఫిల్మ్ ‘మోస‌గాళ్లు’ షూటింగ్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

కోవిడ్‌-10 లాక్‌డౌన్‌తో చిత్రంలో కీల‌క‌మైన ఐటీ ఆఫీస్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ, విష్ణుతో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్ పాల్గొన్న స‌న్నివేశాలు, బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సునీల్‌శెట్టితో క‌లిసి చేసిన క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ల‌తో పాటు అధిక శాతం షూటింగ్ పూర్త‌యింది.

తాజాగా ‘మోస‌గాళ్లు’ చిత్రం విడుద‌ల తేదీని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌ను జూన్ 5వ తేదీ, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను జూలైలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇటీవ‌ల ‘మోస‌గాళ్లు’ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లకు ప్రేక్ష‌కులు, అభిమానుల‌ నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఆ పోస్ట‌ర్ల‌లో అర్జున్‌గా విష్ణు, అను పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి క‌నిపించి ఆక‌ట్టుకున్నారు.

హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస‌గాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.