యశోద మూవీ రివ్యూ

Published On: November 11, 2022   |   Posted By:

యశోద మూవీ రివ్యూ

image.png
సమంత ‘యశోద’ రివ్యూ
Emotional Engagement Emoji
👍
 

యశోద సినిమా గురించి సమంత ప్రమోషన్స్ లో కాస్త ఎక్కువగానే,ఎమోషన్ అవుతూ చెప్పుకొచ్చింది. అదే ఈ సినిమాకు క్రేజ్ క్రియేట్ చేసింది.  సాధారణంగా ఓ సినిమాను ఓకే చేసేందుకు తాను చాలా సమయం తీసుకుంటానని చెప్పిన సమంత, యశోద సినిమా కథను కేవలం ఒక్క సిట్టింగ్‌లోనే ఓకే చేసినట్లుగా చెప్పింది. దర్శకులు ఈ సినిమా కథను నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తీసుకున్నారని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని.. ఇలాంటి ఘటనలు గురించి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలని తాను ఈ సినిమా కథను వెంటనే ఓకే చేసినట్లుగా సమంత చెప్పుకొచ్చింది. అసలు ఈ సినిమా స్క్రిప్టు విని తాను షాక్ అయ్యానని సమంత అంది.సీనియర్ నటి అయిన సమంత అంత షాక్ అయ్యేంత విషయం నిజంగానే ఈ చిత్రంలో ఉందా..లేక సినిమాకు హైప్ తీసుకు రావటానికి అలా చెప్పుకొచ్చిందా… అసలు సినిమా కథేంటి…ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా సమంత కెరీర్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూద్దాం…

స్టోరీ లైన్:
యశోద(సమంత) ఆర్దిక ఇబ్బందులుతో సరోగసి తల్లిగా పనిచేయటానికి ముందుకు వస్తుంది. ఆమెను ఇవా అనే స్పెషల్ సరోగిసి సెంటర్లో పెడతారు. దాన్ని సీక్రెట్ గా రన్ చేస్తూంటారు. అక్కడ యశోద లాంటి వాళ్లు చాలా మంది ఉంటారు. గర్బధారణ సమస్యలు ఉన్నవాళ్లకు ఈ సెంటర్ ద్వారా పరిష్కారం లభిస్తూంటుంది అని పేరు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సెంటర్ కు హెడ్ గా ఉంటుంది. యశోద ని పర్యవేక్షిస్తూంటాడు  డాక్టర్ మధు (ఉన్నికృష్ణన్). అతనితో ప్రేమలో పడుతుంది యశోద. కొద్ది రోజులకు అక్కడ ఆ సరోగసి సెంటర్లో  ఏదో తేడా జరుగుతోందని యశోద పసిగెడుతుంది. దాన్ని ఛేథించాలని పోరాటం మొదలెడుతుంది. ఆక్రమంలో చాలా భయంకరమైన నిజాలు బయిటకు వస్తాయి. సరోగసి సెంటర్  వెనుక పెద్ద మాఫియా ఉందని అర్దం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా సిటీలో శివరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురి అవుతాడు. పోలీస్ అధికారి (సంపత్) ఆ కేసు ఇన్విస్టిగేట్ చేస్తూంటాడు. అసలు ఆ సరోగసి సెంటర్లో …జరుగుతున్నదేమిటి..అక్కడ సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారం ఏమిటి..? దాని వెనక ఉన్నదెవరు.. సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను ఏమి చేస్తున్నారు..? యశోద తెలిసిన ఆ భయంకరమైన నిజం ఏమిటి ? ఆ  మాఫియా పై యశోద ఎలా పోరాటం చేసి, ఎలా గెలిచింది? వంటి విషాయలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్:

ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లే డిజైన్ అంతా ప్రేక్షకుడుని షాక్ కు గురి చేయటమే అంశం ప్రధానాంశంగా సాగుతుంది. అలాగే కథలో జరిగే మర్డర్ లేదా మిస్టర్ లేదా రెండింటిని ఛేథించటానికి ప్రధాన పాత్రతో పాటు ప్రేక్షకుడు కూడా పూనుకుంటాడు. అందుకే సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ఇలాంటి సినిమాలకు కీలకం. అది ఎంత బాగా పేలుతుంది అనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడిఉంటుంది. అలాంటి ఓ ఐడియాలజీతోనే యశోదని కూడా తెరకెక్కించారని సీన్స్ ముందుకు వెళ్లే కొలిది అర్దమవుతూంటుంది.  ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు ఈ చిత్రానికి హైలైట్ . ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా  థ్రిల్లింగ్ గా మారిపోయింది.

ఈ సినిమాకు స్ట్రాంగ్ ఎస్సెట్..సరోగసి చుట్టూ సాగే ఈ స్టోరీ ఐడియానే. ఒక ఎమోషనల్ ఎక్సపీరియన్స్ ని ఇవ్వగలిగే థ్రెడ్ ఉంది. ఫస్టాఫ్ అంతా సెంటిమెంట్ మోడ్ లోనూ,సెకండాఫ్ యాక్షన్, డార్క్ ఎలిమెంట్స్ కలిపి నడిపారు. ఓవరాల్ గా ఓ కొత్త థ్రిల్లర్ ఎక్సపీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే  సీన్స్ మరింత టెన్స్ గా ఉంటే బాగుండేది. అలాగే ప్రధాన పాత్ర సమంత డేంజర్ లో పడినప్పటినుంచే కథలో వేడి పెరుగుతుంది. ఆ సీన్స్ కాస్త లేటయ్యాయనిపించింది. పాత్రల పరిచయం, మిస్టరీ బిల్డప్ చేసేసరికి ప్రీ ఇంటర్వెల్ వచ్చేసింది. అలాగే కామన్ గా మిస్టరీ థ్రిల్లర్స్ వచ్చే ఎలిమెంట్సే రావటం కూడా ఈ జానర్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆసక్తి తగ్గించేసింది.

టెక్నికల్ గా:

ఇలాంటి సినిమాలకు స్క్రిప్టే  ప్రేక్షకుల మనస్సు గెలవటానికి  పెద్ద ఆయుథం. అయితే అదొక్కటే సరిపోదు. టెక్నికల్ గా కూడా సౌండ్ గా ఉండాలి. డైరక్టర్స్ అందుకోసం కొన్ని టెక్నికల్  టెక్నిక్స్  వాడి మన ఇన్విస్టిమెంట్ లెవిల్స్ హై గా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఆ పనే ఇక్కడా డైరక్టర్స్ చేసారు. కొన్ని కెమెరా ఏంగిల్స్ తో …
ఆడియన్స్ లో ఎమోషన్స్, భయం, భాథ కలగచేసే ప్రయత్నం చేసారు.  protagonist ని హెల్ప్ లెస్ గా చూపటానికి బర్డ్స్ వ్యూ యాంగిల్ లోచూపించటం వంటివి. కెమెరా వర్క్ చాలా టెన్స్ ని బిల్డప్ చేస్తూ సాగింది. కొత్త డైరక్టర్స్ ఇద్దరు పడ్డ   కష్టం చాలా ఫ్రేమ్ లలో కనపడింది. అందులోనూ సీనియర్ హీరోయిన్ ని కొత్త డైరక్టర్స్ డీల్ చేయటం అంటే మాటలు కాదు. రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ ,ఫైట్స్ కంపోజింగ్ వంటి మిగతా విభాగాలు కూడా సపోర్ట్ చేసాయి. మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటుల్లో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రాణం పెట్టింది చెప్పాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా డిఫరెంట్ గా తనను తాను ప్రెజెంట్ చేసుకుంది. మిగతావారిలో ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ వంటి వారు తమకు అలవాటైన నటనతో కథను ముందుకు తీసుకెళ్లారు.

ప్లస్ లు :
స్టోరీ లైన్
సమంత ఫెరఫార్మెన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు

మైనస్ లు:
కొన్ని డ్రాగ్ సీన్స్
రొటీన్ గా మారిన సెకండాఫ్
క్లైమాక్స్

చూడచ్చా..

క్రైమ్ థ్రిల్లర్ లు ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్,సమంత కోసం కూడా ఓ లుక్కేయచ్చు.

నటీనటులు :సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు.
సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
దర్శకత్వం: హరి – హరీష్
Run Time: 2 hr 12 Mins
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.