యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల

Published On: October 4, 2021   |   Posted By:

యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల
ఏం. కె క్రియేషన్స్ బ్యానర్ పైన  రాజ్ కుమార్ నిర్మిస్తూ, హీరో గా నటిస్తున్న సినిమా “యాంటీ వైరస్”. ఈ చిత్రానికి సుభాష్ దర్శకుడు. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుక ఇటీవలే జరిగింది. హీరోయిన్లు ప్రియమణి, పూర్ణ మరియు డాన్స్ మాస్టర్ గణేష్ లు ఈ చిత్రం యొక్క పాటలు  విడుదల చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ “హీరో నిర్మాత  రాజ్ కుమార్ నాకు మంచి మిత్రుడు, తను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. పాటలు చాలా బాగున్నాయి, సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలి” అని కోరుకున్నారు.


హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ “టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, ప్రస్తుతం ఉన్న కోవిడ్ కి ఈ సినిమా యాంటీ డోస్ లాగా ఆడియన్స్ ని మెప్పించాలి. పాటలు మరియు ట్రైలర్ చూసాను, సినిమా కొత్తగా ఉంది. మంచి విజయం సాధించాలి” అని తెలిపారు.


హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ “సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది, సినిమా లోని కొన్ని షాట్స్ చూసాను చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి,టీం అందరికీ బెస్ట్ విషెస్.


హీరో & నిర్మాత రాజ్  కుమార్ మాట్లాడుతూ “నేను అడగగానే మా సినిమా పాటలు విడుదల చేసిన గణేష్ మాస్టర్ కి, పూర్ణ గారికి, ప్రియమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీం అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం, మా హీరోయిన్ లు అనూష, నందిత లు డెడికేషన్ తో వర్క్ చేశారు. పాటలు ,ఫైట్స్ , మెసేజ్ ఇలా అన్ని అంశాలు మా సినిమా లో ఉన్నాయి, కమర్షల్ సినిమా కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ని తీయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.


ఈ సినిమా కి కెమెరా-  శ్రీనివాస్ సబ్బి, సంగీతం – మురళి లియోన్,
లిరిక్స్ – లక్ష్మిభాస్కర్ కనకాల,
డాన్స్ :-
గోరా మాస్టర్,
నరేందర్ మాస్టర్,
చార్లీ మాస్టర్,