యానిమల్ మూవీ అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: September 23, 2023   |   Posted By:

యానిమల్ మూవీ అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ యానిమల్ నుంచి బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ పీస్ యానిమల్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇటివలే విడుదల చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్..ఈ చిత్రంలో రణబీర్ కపూర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఇంటెన్స్ గా వుంటుందో సూచించింది.

తాజాగా మేకర్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అతని ఛాతిపై బ్యాండేజ్ ని కూడా గమనించవచ్చు. ఈ ఇంటెన్స్ లుక్ యానిమల్ లో అనిల్ కపూర్ గా పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేస్తోంది.

యానిమల్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు..వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్, విజనరీ రచయిత-దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని కలిపే ఒక క్లాసిక్ సాగా. ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. రష్మిక మందన, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ.. భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది.

యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – 5 భాషల్లో విడుదల కానుంది.

తారాగణం :

రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్