యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ మోషన్ పోస్టర్  విడుదల

ప్రస్తుతం దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సినిమాలు చేస్తూ సక్సెస్‌లు కొడుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. యావరేజ్ స్టూడెంట్ నాని అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఇదొక యూత్ ఫుల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అందరికీ అర్థం అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్.ఎస్.బి ఈ చిత్రానికి ఎడిటర్.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం :

పవన్ కుమార్ కొత్తూరి, సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు

సాంకేతిక సిబ్బంది :

రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
నిర్మాతలు: పవన్ కుమార్.కె, బిషాలి గోయెల్
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB