యేవమ్‌ చిత్రం భరత్‌రాజ్‌ లుక్‌ విడుదల

కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు  ప్రకాష్‌ దంతులూరి .

 

ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్‌’ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి  ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.

 

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేశార.

 

తాజాగా ఈ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అభిరామ్‌గా కనిపించనున్న భరత్‌రాజ్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోలీస్‌ గెటప్‌లో గన్‌ను ఎయిమ్‌ చేస్తూ అతని లుక్‌ కనబడుతుంది.

 

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ  ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది.  మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది.  ఈ రోజు విడుదల చేసిన అభిరామ్‌ లుక్‌ కూడా అందర్ని అలరిస్తుంది. ఈ పాత్రలో కూడా డిఫరెంట్‌ షేడ్స్‌ వుంటాయి. ఈ చిత్రంలో  ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.

 

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు