రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి ఎంపికైన మధురపూడి గ్రామం అనే నేను మూవీ

Published On: December 18, 2023   |   Posted By:

రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి ఎంపికైన మధురపూడి గ్రామం అనే నేను మూవీ

ప్ర‌తిష్టాత్మ‌క రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి ఎంపికైన మధురపూడి గ్రామం అనే నేను

శివ కంఠమనేని, క్యాథ‌లిన్ గౌడ హీరోహీరోయిన్లుగా క‌ళ్యాణ్ రామ్ కత్తి ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మధురపూడి గ్రామం అనే నేను. మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే…ఒక ఊరికి ఆత్మ ఉంటే…త‌న ఆత్మ‌క‌థ‌ను తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ ర‌స్టిక్ స‌న్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది.

ప‌ల్లెటూరి మొర‌టోడు అయిన సూరి పాత్ర‌లో శివ కంఠమనేని ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. త‌న కామెడి టైమింగ్‌తో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌లో అద్భుత‌మైన న‌ట‌న‌ని క‌న‌బ‌రిచారు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్‌లో దుమ్ములేపాడ‌నే చెప్పాలి. ఇక‌ డిజిట‌ల్ వాలెంటీర్‌గా హీరోయిన్‌ క్యాథలిన్ గౌడ న‌ట‌న చ‌క్క‌గా ఉంది. అభిమ‌న్యు, భ‌ద్రాద్రి, క‌త్తి చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌ల్లికార్జున్ (మ‌ల్లి) ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. మణిశర్మ పాటలు అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి.

తాజాగా ఈ చిత్రం ప్ర‌తిష్టాత్మ‌క 10వ రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ 2023(RAJASTHAN INTERNATIONAL FILM FESTIVAL (RIFF)కి ఎంపికైంది. జన‌వ‌రి2024లో ఈ అవార్డును ప్ర‌ధానం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా..

హీరో శివ కంఠమ‌నేని మాట్లాడుతూ `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను సినిమాకు అన్ని వ‌ర్గాల‌ ఆడియ‌న్స్ నుండి మంచి స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా బీ,సీ సెంట‌ర్ల‌ల‌లో ఫుల్‌ర‌న్‌తో బాగా ఆడింది. ఇప్పుడు మా చిత్రం ప్ర‌తిష్టాత్మ‌క 10వ రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి ఎంపిక‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని అవార్డులు ఈ సినిమా సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. అతి త్వ‌ర‌లో ప్ర‌ముఖ ఓటీటీలో మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను స్ట్రీమింగ్ కానుంది` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ల్లి మాట్లాడుతూ `మా చిత్రాన్ని మ‌న‌స్పూర్తిగా ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు..మొద‌టి నుండి మా టీమ్ అంద‌రం ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ రోజు మా న‌మ్మ‌కం నిజ‌మైంది. రాజ‌స్థాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ 2023కి మా సినిమాను సెల‌క్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లో మ‌రో మంచి చిత్రంతో మీ ముందుకు వ‌స్తాను` అన్నారు.

నటీనటులు :

శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు

సాంకేతిక వర్గం :

రచన, దర్శకత్వం: మల్లి,
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: గౌతమ్ రాజు,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్