రాజు యాదవ్‌ చిత్రం మే 24 విడుదల

రాజు యాదవ్‌ చిత్రం అందరినీ అలరిస్తుంది. గెటప్ శ్రీను హీరోగా మీ మన్ననలను అందుకుంటాడని ఆశిస్తున్నాను: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ రాజు యాదవ్ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

తాజాగా గెటప్ శ్రీను, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్‌ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

గెటప్ శ్రీను.. ఈ పేరు తలచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్పులు, హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ళముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకువస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు. గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తుంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్ననలని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్అని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.

సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

నటీనటులు :

గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి