రావణాసుర మూవీ రివ్యూ

Published On: April 7, 2023   |   Posted By:

రావణాసుర మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

రవితేజ సినిమాలు అంటే ఫ్యామిలీలు అంతా కలిసి వెళ్తూంటారు. రీసెంట్ గా వచ్చిన ధమాకా, వాల్తేరువీరయ్యా కూడా అలాంటి సినిమాలే. ఈ క్రమంల ఓ డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని రవితేజ ఫస్ట్ టైమ్ ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ధమాకా వంటి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ తర్వాత రవితేజ సోలో హీరోగా నటించిన చిత్రమిది. మధ్యలో వాల్తేరు వీరయ్య విజయం ఉంది. అంచనాల నడుమ విడుదలైన రావణాసుర ఎలా ఉంది?

స్టోరీ లైన్ :

బిజినెస్ టైకూన్ విజయ్ తల్వార్ (సంపత్) ని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. పూర్తి ఆధారాలతో అతను దొరికిపోతాడు. కానీ తనేమీ అసలు హత్య చేయలేదని,తనకు ఏమీ తెలియదని అంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్దం కాలేదన్నా అతన్ని జైల్లో పెడతారు. అతన్ని బయిటకు తేవటానికి అతని కుమార్తె హారికా తల్వార్ (మేఘా ఆకాష్) అడ్వకేట్ కనక మహాలక్ష్మి(ఫరియా అబ్దుల్లా) దగ్గరకు వస్తుంది. అక్కడే రవీంద్ర(రవితేజ) జూనియర్ లాయిర్ గా చేస్తూంటాడు. ఆమెకు హెల్ప్ చేయటానికి ముందుకు వస్తాడు. అయితే అదే సమయంలో మరో హత్య కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఆ తర్వాత మరొకటి. దాంతో ఏసిపి హనుమంతరావు (జయరామ్) సీన్ లోకి వచ్చి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ క్రమంలో అనేక షాకింగ్ విషయాలు బయిటకు వస్తాయి. ఇంతకీ ఎవరు ఆ చిత్రమైన హత్యలు చేస్తున్నారు. వాటికి రవీంద్రకు సంభందం ఏమిటి. అనేది మిగతా కథ.

ఎనాలసిస్ :

పాత్రల పరిచయం తర్వాత ఎంతోకొంత కథని ఓపెన్ చేయాలి. అప్పుడే ప్రేక్షకుడు ఆ పాత్రలతో ప్రయాణిస్తాడనే విషయం మర్చిపోయారు. రావణాసురలో వున్న ప్రధాన సమస్య ఏమిటంటే సెకండ్ హాఫ్ వరకూ అసలు ఇందులో కథ ఏమిటి ? అనే క్వశ్చన్ మార్క్ పేస్ తోనే వుండిపోతాడు ప్రేక్షకుడు. తొలి సగంలో కథ లేనప్పుడు బలమైన వినోదమైన రాసుకోవాలనే ప్లాన్ చేసారు. కానీ అదీ జరగలేదు. క్రిమినల్ లాయిర్ గా కాసేపు ఫన్, ఫైట్స్, డాన్స్ లు అంటూ చేసే ప్రయత్నాలుఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూశాం. రవితేజ కూడా అదే ట్రాక్ ని వాడుకున్నాడు. వాడుకోవడంలో తప్పులేదు కానీ సీన్స్ కొత్తగా అనిపించాలి. కానీ అలా జరగలేదు. హైపర్ ఆది జబర్దస్త్ సింగెల్ లైనర్స్ చెప్పి నవ్వించాలనే ప్రయత్నం పెద్దగా నవ్వించలేదు. హీరో హీరోయిన్ ట్రాక్ లో కూడా ఫ్రెష్ నెస్ కనిపించలేదు. మరి ఇంకేమి చూసి ఈ సినిమాకు జై కొట్టాలి.

రావణాసుర అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలుపెట్టిన డైరక్టర్ సుధీర్ వర్మ ఆరంభంలో ఆసక్తిగానే నడుపుతారు. సుశాంత్ వచ్చాక సినిమా పరుగెడుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పొంతన లేకుండా సెకండ్ హాఫ్ లో ఓ థ్రిల్లర్ తెరపైకి వస్తుంది. మలుపులతో ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేసేయాలనే ఆలోచన మంచిదే. అయితే ట్విస్ట్ అనేది ప్రేక్షకుడికి అనిపించాలి. కానీ ఇందులో చాలా ట్విస్ట్ లు పది నిమిషాలకు ముందే ప్రేక్షకులు అర్ధమౌపొతుంటాయి. ఒకసారి ఇది విసుగెత్తించే బోర్ స్క్రీన్ ప్లే అని తెలుసుకున్న తర్వాత ప్రతి పాత్ర కూడా తేలిపోయి తర్వాత ఏం జరుగుతుందో అనే ఎక్సయిట్ మెంట్ తగ్గిపోతుంది. హీరో నెగిటివ్ గా ఉండే డ్రామా సహనానికి పరీక్షపెడుతుంది. పైగా ఆ ఎపిసోడ్స్ లో మితిమీరిన హింస చిరాకు పెడుతుంది. ఇందులో కొన్ని మలుపులు వున్నాయి. అయితే అవేవి వావ్ అనిపించే మలుపులు కాలేకపోయాయి.

ముఖ్యంగా ఈ సినిమా విన్సీడా అనే బెంగాలీ సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అయితే సినిమాలో క్రైమ్ ఉన్నంతగా థ్రిల్స్ ని పండించలేకపోయారు. ఈ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కలపాలనే తాపత్రయంలో స్క్రీన్ ప్లేని వదిలేసారు. క్రైమ్ థ్రిల్లర్ కాస్తా కమర్షియల్ థ్రిల్లర్ చేసే క్రమంలో అటు ఇటు కాకుండా చేసేసారు. ఫస్టాఫ్ లో వచ్చే పాత్రలు, సన్నివేశాలు ప్రధానంగా రవితేజ పాత సినిమాల థోరణిలోనే సాగుతాయి. కామెడీ, రొమాన్స్ మిగతా విషయాలను డామినేట్ చేసేస్తాయి. అయితే ఈ ఫార్ములా విషయాన్ని చూడటానికి మనకి ఆసక్తి ఉండు.దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు సహజమైన ఆసక్తికరమైన డ్రామాని క్రియేట్ చేయలేకపోయాయి. దానికి తోడు హీరో ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటలా ముందుకు వెళ్తూంటాడు. కానీ ఎక్కడా అడ్డం అనేది ఉండదు. అన్నిటికన్నా ప్రధానంగా ఇందులో విలన్ కి హీరోకి మధ్య బలమైన సంఘర్షణ కనిపించదు.

టెక్నికల్ గా :

ఈ సినిమా టెక్నికల్ గా సౌండ్ గా ఉంది. నేపధ్య సంగీతం హెవీగా అనిపించింది. దానికి తగిన ఎమోషన్స్ సీన్స్ యాడ్ అవ్వలేదు. దీంతో చాలా సన్నివేశాలని నేపధ్య సంగీతం డామినేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. కెమరాపనితనం రిచ్ గా వుంది. చాలా సీన్స్ లావిష్ గా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో సినిమా స్క్రీన్ ప్లే బోర్ కొట్టేసింది. డైలాగుల్లో గుర్తుపెట్టుకునే మాటలైతే లేవు. రవితేజ నెగిటివ్ యాక్షన్ ఓకే కానీ పెద్దగా కలిసి రాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్, సెకండ్ హాఫ్ లో మలుపులని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అయితే ఈ రెండూ కూడా బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి.

నటీనటుల్లో :

రవితేజ ఇంత నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించడం ఇదే తొలిసారి. ఫస్ట్ సీన్ నుంచి చివరి సన్నివేశం వరకూ ఆ పాత్ర నుంచి బయటికి రాలేదు. అంత సహజంగా ఈ నెగిటివ్ క్యారెక్టర్ ని మోశాడు . ఫైట్ సీన్స్ లో కొత్త రవితేజని చూపించాడు. సుశాంత్ ది ఫుల్ లెంగ్త్ క్యారక్టరే కానీ పెద్దగా పనికొచ్చే వ్యవహారం కాదు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఎవరూ పెద్దగా గుర్తు ఉండరు. హైపర్ ఆది కామెడీ ఓకే. సంపత్ రాజ్, మురళీ శర్మ, జయ రామ్ వంటి సీనియర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.

చూడచ్చా :

రవితేజ వీరాభిమానులుకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటులు :

రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతికవర్గం :

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్
కథ, & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
రన్ టైమ్: 141 మినిట్స్
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2023