రైటర్ పద్మభూషణ్ చిత్ర యూనిట్ అభినందన సభ

Published On: February 10, 2023   |   Posted By:

రైటర్ పద్మభూషణ్‌ చిత్ర యూనిట్ అభినందన సభ

రైటర్ పద్మభూషణ్‌ చిత్ర యూనిట్ ని అభినందించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్

రైటర్ పద్మభూషణ్‌ చిత్ర యూనిట్ కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్ కుమార్ అభినందించారు. సుహాస్ కథానాయకుడిగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రైటర్ పద్మభూషణ్‌. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.

ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్ కుమార్.. రైటర్ పద్మభూషణ్‌ సినిమాతో పాటు సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు అనురాగ్‌రెడ్డి, చంద్రూలపై ప్రశంసలు కురిపించారు.

రైటర్ పద్మభూషణ్‌ సినిమాకి చాలా గొప్ప స్పందన వస్తోంది. ఇంత చక్కని సెన్సిబుల్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అంతే గొప్ప స్పందన రావడం చాలా అనందంగా వుంది. ప్రివ్యూ షో గ్లింప్స్ చూశాను. ప్రేక్షుల నుంచి వచ్చిన స్పందన నా మనసుని హత్తుకుంది. అతి త్వరలోనే సినిమాని చూస్తాను. ఇంత చక్కటి సినిమాని అందించిన టీం అందరికీ అభినందనలు. సినిమా ఇంకా చూడని వారు.. ప్లీజ్ గో అండ్ వాచ్ రైటర్ పద్మభూషణ్ అని కోరారు.

రైటర్ పద్మభూషణ్‌ ఘన విజయం సాధించి ప్రస్తుతం అన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది.