రైతు మూవీ టీజర్ విడుదల

కన్యాకుమారి సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్ పరిచయం చేస్తూ రైతు టీజర్ రిలీజ్

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా కన్యాకుమారి. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా దామోదర రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు కన్యాకుమారి సినిమా నుంచి తిరుపతి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రైతు టీజర్ రిలీజ్ చేశారు.

రైతు టీజర్ ఎలా ఉందో చూస్తే  శ్రీకాకుళం జిల్లాలోని పెంటపాడులో ఐదు ఎకరాల రైతు తిరుపతి. ఏడో తరగతి చదువుకున్న తిరుపతి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ వృత్తే అతని పెళ్లికి అడ్డుగా మారుతుంటుంది. సంబంధాల కోసం వెళ్లిన చోటల్లా ఉద్యోగస్తుడైన కుర్రాడికే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అంటారు. తిరుపతి రైతు అనే చిన్నచూపు చూస్తుంటారు. బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లతో ఛాలెంజ్ చేస్తాడు తిరుపతి. ఈ యువ రైతు చేసిన సవాలును నిలబెట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూడాలి. ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉన్న రైతు టీజర్ ఆకట్టుకుంది.

నటీనటులు :

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ

టెక్నికల్ టీమ్ :

ఎడిటింగ్ : నరేష్ అడుప
సినిమాటోగ్రఫీ : శివ గాజుల, హరిచరణ్ కె
మ్యూజిక్ : రవి నిడమర్తి
బ్యానర్ : రాడికల్ పిక్చర్స్
రచన, ప్రొడ్యూసర్, డైరెక్టర్ : దామోదర