రోటి కపడా రొమాన్స్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published On: November 15, 2023   |   Posted By:
రోటి కపడా రొమాన్స్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ టైటిల్‌కి తగ్గట్టే వైవిధ్యంగా ఉంది.
ఈ ఫస్ట్ లుక్‌లో హీరోలు నలుగురు కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇందులో వైజాగ్ బీచ్‌ని తలపిస్తూ.. పెద్ద సైజులో మందు బాటిల్, లైట్ హౌస్, సముద్రం, సముద్రపు ఒడ్డున ఇసుకలో సోఫా, ఆ సోఫాలో ముగ్గురు హీరోలు కూర్చుంటే.. కింద ఇసుకలో మరో హీరో కూర్చుని ఉన్నారు. ఓ చెక్క బల్లతో పాటు, ఓల్డ్ టీవీని కూడా ఇందులో గమనించవచ్చు. ఏదో పోగొట్టుకున్న వాళ్లలా.. లేదంటే, ఎవరో వస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో డిజప్పాయింట్ అయినట్లుగా హీరోల ముఖాలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ యూత్‌ని ఆకర్షించేలా ఉండటంతో పాటు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్ర విడుదల వివరాలను త్వరలోనే నిర్మాతలు తెలియజేయనున్నారు.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి