లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ ప్రారంభం

Published On: September 25, 2023   |   Posted By:

లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ ప్రారంభం

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ ప్రారంభం

దుల్కర్ సల్మాన్ భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు అత్యంత విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఒకరు. ఆయన కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు.

సీతా రామం తర్వాత, ఆయన ప్రతిభావంతులైన దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగులో తన తదుపరి చిత్రం లక్కీ భాస్కర్ను ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గత కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలను అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చురుకైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. వారు ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు. సార్/వాతి తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో ఇది వారి రెండవ పాన్-ఇండియా చిత్రం.

లక్కీ భాస్కర్ షూటింగ్ సెప్టెంబర్ 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు పాల్గొని సినిమాపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

లక్కీ బాస్కర్ కథ ఈ ఇతివృత్తాన్ని అనుసరిస్తుందని చెప్పబడింది, ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం కొలవలేని ఎత్తులకు. ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణంగా ఈ చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం :

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి

సాంకేతికవర్గం :

డి ఓ పి: నిమిష్ రవి
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్