లవ్ మీ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌

Published On: March 8, 2024   |   Posted By:

లవ్ మీ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌

‘ఆర్య’ కథ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది – స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ ఉప శీర్షిక. ఈ చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిది నిర్మించారు. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను గురువారం విడుదల చేశారు. గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఆర్య సినిమాతో సుకుమార్‌ను ఇంట్రడ్యూస్ చేశాం. ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఇలాంటి పాయింట్‌తో ఇంత వరకు కథ రాలేదు. పీసీ శ్రీరామ్ గారి కెమెరా, కీరవాణి గారి సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే పాటను రిలీజ్ చేయబోతోన్నాం. అది యూత్‌కు బాగా నచ్చేస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ చాలా ముఖ్యం. బేబీ అప్పుడే సూపర్ హిట్ అయింది. వైష్ణవి దొరుకుతుందో లేదో అనుకున్నాం. స్క్రిప్ట్ విను నచ్చితేనే చేయ్ అని అన్నాను. మళ్లీ ఆఫీస్‌కు వచ్చి నాలుగు గంటలు స్క్రిప్ట్ చదివింది. వైష్ణవి లేకుంటే ఈ సినిమాను ఇంత ఎంజాయ్ చేసే వాళ్లం కాదు. ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేశాం. సక్సెస్ మీట్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తాం’ అని అన్నారు.

డైరైరెక్టర్ అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడే దాని కన్నా నా సినిమా మాట్లాడాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. థియేటర్‌కు రండి. మా సినిమాను చూడండి. ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

ఆశిష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లవ్ మీ టీజర్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న స్టూడెంట్స్‌కి థాంక్స్. ఈ చిత్రంలో నేను దెయ్యం అని తెలిసి లవ్ చేస్తాను. అమ్మాయిలు దెయ్యాలు కాదు దేవతలు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా అరుణ్, నాగ వల్ల మా వద్దకు వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్‌కి నచ్చే కథ వస్తే దిల్ రాజు గారు వెంటనే ముందుకు వస్తారు. ఆయన ఇంకా యంగ్ కుర్రాడిలానే ఉంటారు. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. పీసీ శ్రీరామ్ గారు మా సినిమాకు పని చేయడం అదృష్టమ’ని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘గురు నానక్ కాలేజ్‌లోనే బేబి సినిమాను షూట్ చేశాం. ఇప్పుడు మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాం. ఇది నాకు చాలా లక్కీ కాలేజ్. లవ్ మీ టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. బేబి వల్లే నాకు ఈ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ‘లవ్ మీ’ స్కేరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇలాంటి పాయింట్, స్టోరీ ఇంత వరకు నేను చూడలేదు. వినలేదు. థియేటర్లో చూసేటప్పుడు నవ్వుకుంటారు. షాక్ అవుతారు. కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. పీసీ శ్రీరామ్ సర్, కీరవాణి సర్, అవినాస్ కొల్ల సర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఏప్రిల్ 27న మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ’ని అన్నారు.

నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
దర్శకుడు : అరుణ్ భీమవరపు
కెమెరామెన్ : పీసీ శ్రీరామ్
సంగీతం : కీరవాణి
ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి
పీఆర్.ఒ : వంశీ కాకా