వకీల్ సాబ్ చిత్రం సాంగ్‌ విడుద‌ల
 
వకీల్ సాబ్’ నుంచి మెలోడీ సాంగ్ ‘కంటి పాప కంటి పాప…’ రిలీజ్
 
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 
 
ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు మ‌గువ సాంగ్… స‌త్య‌మేవ జ‌య‌తే సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్  వ‌చ్చింది. బుధ‌వారం ఈ సినిమాలో ‘కంటి పాప కంటిపాప‌..’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఇది. 
 
‘‘కంటి పాప కంటి పాప.. చెప్ప‌నైన లేదే
నువ్వంత‌లా  అలా ఎన్ని క‌ల‌లు క‌న్నా…
కాలి మువ్వ కాలి మువ్వ స‌వ్వ‌డైన లేదే, 
నువ్వెన్ని నాళ్లుగా..వెంట తిరుగుతున్నా..’’
 
అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్‌పై హీరో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్న ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలాంటి మాస్, క్లాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా  సినిమాను ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తెర‌కెక్కించాడు. 
 
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌:  తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం:   శ్రీరామ్ వేణు