వర్జిన్ స్టోరి చిత్రం సాంగ్ విడుదల

లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ “వర్జిన్ స్టోరి” నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ఈ యంగ్ టాలెంట్ “వర్జిన్ స్టోరి” చిత్రంతో  హీరోగా ప్రేక్షకుల
ముందుకొస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు.

“వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్రోకెన్ లవ్ పాటను విడుదల చేశారు.

అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన బ్రోకెన్ లవ్ పాటకు అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా హారికా నారాయణ్ పాడారు. ప్రేమికుడు దూరమైన సందర్భంలో నాయిక పాడుకునే సాడ్ సాంగ్ ఇది. ఏమో ఏమో అనుకోవడం, ఏదో ఏదో అయిపోవడం, ఏమో ఏమో ఏం చేయడం, ఎన్నో ప్రశ్నలైందే ఒక జీవితం. అంటూ సాగుతుందీ పాట.

మ్యూజిక్ పరంగా “వర్జిన్ స్టోరి” మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటిదాకా విడుదలైన పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా బ్రోకెన్ లవ్ కూడా యూత్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంది. టీజర్ , ట్రైలర్ తో పాటు ఈ ఛాట్ బస్టర్ సాంగ్స్ సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి.

విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాఘవేంద్ర,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.