వాట్ ది ఫిష్ మూవీ పోస్టర్ విడుదల

Published On: January 20, 2023   |   Posted By:

వాట్ ది ఫిష్ మూవీ పోస్టర్ విడుదల

మనోజ్ మంచు, 6ix సినిమాస్, వరుణ్ కోరుకొండ వాట్ ది ఫిష్ అనౌన్స్ మెంట్

అటెన్షన్ ఆల్ మూవీ లవర్స్ ! మీరు హార్ట్-పంపింగ్, యాక్షన్-ప్యాక్డ్ , సైడ్-స్ప్లిటింగ్లీ హిలేరియస్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా? సరే, మీ సీట్లలో వుండండి. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మీకు ఓ ప్రత్యేక వార్త అందిస్తున్నారు.

ఆరు సంవత్సరాల విరామంలో ఉన్న మంచు మనోజ్ ఈరోజు అధికారికంగా ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్‌తో గతంలో కంటే ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తున్నారు. వాట్ ది ఫిష్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రపంచ స్థాయి వైబ్ లను కలిగిస్తుంది. పోస్టర్ చిత్రానికి సంబధించిన ముఖ్య అంశాల అంతర్గత వివరాలను వెల్లడిస్తుంది. ఈ ఆసక్తికరమైన పోస్టర్ లో చాలా మంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవటానికి మనోజ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గోగల్ మాస్క్ తో ఉన్న అమ్మాయి క్యారియేచర్ చిత్రాన్ని కూడా చూపిస్తుంది. బ్యాక్ పోజ్‌లో మనోజ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. మనోజ్ మేక్ ఓవర్ అయ్యారు. అతని కొత్త గెటప్‌ను చూడటానికి మరికొంత సమయం వేచి చూడాలి.

మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్ లైన్.

మనోజ్ మంచు గారితో సినిమా చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. డార్క్ కామెడీ, హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వాట్ ది ఫిష్ ని అనౌన్స్ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. భారతీయ సాంస్కృతిక కంటెంట్ ని అంతర్జాతీయంగా చూపించాలానే చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్ట్ వచ్చింది” అని దర్శకుడు వరుణ్ తెలిపారు.

ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ అందమైన టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది. ప్రతిభావంతులైన తెలుగు నటీనటులు, ప్రపంచ ప్రఖ్యాత నటీనటులు, సిబ్బంది ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. త్వరలోనే వివరాలు తెలియజేస్తారు.

వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మీరు ఎక్కడ ఉన్నా, థియేటర్స్ లో మీ ప్రతి నిమిషం విలువైనది గా భావించి, ఒక మాస్టర్ పీస్ ని రూపొందించడానికి మా ప్రయత్నాన్ని మీరు ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు మిస్ చేయకూడదనుకునే సినిమా ఇది. కాబట్టి, మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. వాట్ ది ఫిష్ తో అద్భుతమైన సాహసం కోసం సిద్ధంగా ఉండండి

వాట్ ది ఫిష్ అత్యున్నత నిర్మాణ విలువలు, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందనుంది. పాన్-ఇండియా, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది 6ix సినిమాస్ బ్యానర్‌పై రాకింగ్ స్టార్ మనోజ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబధించిన మరిన్ని వివరాలు కోసం వేచి చూడాలి.

తారాగణం :

మనోజ్ మంచు

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: వరుణ్
బ్యానర్: 6ix సినిమాస్, ఏ ఫిల్మ్ బై వి