వాల్తేరు శీను చిత్రం సుమంత్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సుమంత్‌, ఐమా జంటగా మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వాల్తేరు శీను’.

రాజ్‌ క్రియేషన్స్‌ పతాఆకంపై రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుదిదశలో ఉంది.

బుధవారం సుమంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్‌ లుక్‌ను విడుదలచేశారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సుమంత్‌ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శీనుగా విశాఖపట్నం రౌడీగా సుమంత్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. హీరో లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తుంది’’ అని అన్నారు.

మధు నందన్‌, హైపర్‌ ఆది, మిర్చి కిరణ్‌, ప్రభ (సీనియర్‌ నటి) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌.కె.రాబిన్స్‌