విజయ్ దేవరకొండ లైగ‌ర్ ‌సినిమాతో బాలీవుడ్‌లోకి

Published On: January 18, 2021   |   Posted By:

విజయ్ దేవరకొండ లైగ‌ర్ ‌సినిమాతో బాలీవుడ్‌లోకి

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరిజ‌గ‌న్నాధ్‌, క‌ర‌న్ జోహ‌ర్‌, ఛార్మీ కౌర్ ప్యాన్ ఇండియా ఫిలిం`లైగ‌ర్‌`(సాలా క్రాస్ బ్రీడ్‌)

టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ, ఇటీవ‌లే ఇస్మార్ట్ శంక‌ర్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ `లైగ‌ర్`‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

పూరి కనెక్ట్స్‌తో  కలిసి, బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఒక యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

విజయ్‌దేవ‌ర‌కొండ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ అన‌న్యా పాండే న‌టిస్తోంది.

ఈ రోజు  `లైగ‌ర్` మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌పోస్ట‌ర్‌ను అధికారికంగా విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌.

`లైగర్ `టైటిల్‌తో పాటు  `సాలా క్రాస్‌బ్రీడ్` అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్నఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్‌తో మార్ష‌ల్ ఆర్టిస్ట్‌లా క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సింహం మరియు పులి యొక్క మిశ్రమ రూపం ఉంది.

టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ `లైగర్`.

`లైగ‌ర్` టైటిల్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతోపాటు ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ అందిరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

ఈ సంద‌ర్భంగా `మా పాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగ‌ర్`ను స‌గౌర‌వంగా ప్ర‌క‌టిస్తున్నాం. నేష‌న్ వైడ్ మ్యాడ్‌నెస్ గ్యారెంటీడ్ అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే  పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని డిఫ‌రెంట్ లుక్‌తో  ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ తన ఇంటెన్స్ లుక్‌, పొడ‌వాటి జుట్టుతో ఆక‌ట్టుకున్నాడు.

ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో పూరి కనెక్ట్,  ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ‌లు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు.

పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మికౌర్‌, క‌ర‌న్‌జోహార్ మ‌రియు అపూర్వ మెహ‌తా నిర్మాత‌లు.

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీల‌క‌ పాత్ర పోషిస్తున్నారు.

న‌టీన‌టులు: విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, రమ్య‌కృష్ట‌, రోనిత్ రాయ్‌, విష్ణురెడ్డి, ఆలీ, మ‌రకంద్‌ దేశ్ పాండే, గెట‌ప్ శ్రీ‌ను

సాంకేతిక వ‌ర్గం:
బేనర్స్: పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్
సినిమాటోగ్ర‌ఫి: విష్ణు శ‌ర్మ‌,
ఆర్ట్‌: జానీ షేక్ భాషా,
ఎడిట‌ర్: జునైద్ సిద్దిఖీ.
నిర్మాతలు: పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మికౌర్‌, క‌ర‌న్‌జోహార్ మ‌రియు అపూర్వ మెహ‌తా.
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.