విశ్వక్ సేన్ ఫ్యామిలీ ధమాకా షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది

Published On: September 14, 2023   |   Posted By:

విశ్వక్ సేన్ ఫ్యామిలీ ధమాకా షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సరికొత్త ముఖ చిత్రంగా మారుతున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్

ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ప్రధానంగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ కథానాయకుడు ఎవరో కాదు విశ్వక్ సేన్. విలక్షణమైన నటనతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ హీరో హోస్ట్‌గా మారి సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ షో ఏదో కాదు అందరిలో ఎంతో ఆతృతను పెంచేలా చేసిన షో ఫ్యామిలీ ధమాకా. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫ్యామిలీ ధమాకా అనేది కేవలం షో మాత్రమే కాదు. కుటుంబాల మధ్య జరిగే పండుగలాంటిది. ఓ వైపు మన బుర్రకు పదును పెడుతూనే తిరుగులేని వినోదాన్ని అందిస్తుంది. ఈ ఫ్యామిలీ ధమాకాకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరించటం వల్ల సరికొత్త ఛరిష్మాను తీసుకొచ్చారు. విశ్వక్ సేన్ గురించి మన ఆడియెన్స్‌కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్ రెడీ మన వాళ్ల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తను ఈ ఫ్యామిలీ ధమాకాను హోస్ట్ చేయటం అనేది వీక్షకులకు ఓ నవ్వుల ప్రయాణంలా ఉంటుంది.

ఓటీటీలో హోస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వక్ ఇదొక కీలకమైన ప్రారంభం అనే చెప్పాలి. తను ప్రతిభతో రోజు రోజుకీ తన విస్తృతిని పెంచుకుంటూ వెళుతున్నారు. తను ఆడియెన్స్‌ను అలరిస్తారనే దానికి ఆహా ఎంత నమ్మకంగా ఉందో చెప్పటానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు.

తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు ఫ్యామిలీ ధమాకాలో సరికొత్త సవాళ్లను అందించనుంది. ఇవెంతో ఉల్లాసంగా ఉండబోతున్నాయి. అలాగే భావోద్వేగాల కలయికగా ఓ రోలర్ కోస్టర్‌లా ఈ షో ఆకట్టుకోనుంది. ఇలాంటి షోలో విశ్వక్ సేన్ అడుగు పెట్టడమనేది ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరింత ఊపునిచ్చినట్లేననాలి.

ఫ్యామిలీ ధమాకాను ప్రారంభించటానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి విశ్వక్ సేన్ సరికొత్త అర్థాన్ని చెప్పబోతున్నారనేది పక్కా. మీ కుటుంబాలకు విశ్వక్ సేన్ సరికొత్త ధమాకాను అందించబోతున్నారు. ఇచ్చి వినోదంతో పాటు తెలియని ఉత్సాహాన్ని అందించనుంది. ఫ్యామిలీ ధమాకా సెప్టెంబర్ 8న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.