శశివదనే చిత్రం టైటిల్ సాంగ్ 1 ఫిబ్రవరి 2023 న విడుదల

Published On: January 27, 2023   |   Posted By:

శశివదనే చిత్రం టైటిల్ సాంగ్ 1 ఫిబ్రవరి 2023 న విడుదల

ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్ జంటగా నటించిన శశివదనే చిత్రం నుంచి ఫిబ్రవరి 1న టైటిల్ సాంగ్ విడుదల – ఆకట్టుకుంటోన్న ప్రోమో

యువ కథానాయకుడు ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా శశివదనే . గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. గౌరి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.వి.ఎస్.కన్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సాయి మోహ‌న్ ఉబ్బన ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. రక్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్, క‌న్నడ న‌టుడు దీప‌క్ ప్రిన్స్, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

శుక్ర‌వారం నిర్మాత అహితేజ బెల్లంకొండ శశివదనే టైటిల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోను గమనిస్తే కోమలి ప్రసాద్ దేవుడికి పూజ చేసి తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రేమికుడు ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే ఆనందంతో మేడ పైకి ప‌రుగులు తీస్తుంది. ప్రోమో చాలా నేచుర‌ల్‌గా, క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకుంటోంది.

హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ పాట‌ను సినిమాలో తొలి పాట‌గా అల‌రించ‌నుంది. శ్రవణ వాసుదేవ‌న్ సంగీతం అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం ట్యూన్‌కు త‌గ్గ‌ట్లు అందంగా ఉన్నాయి. శ‌శివ‌ద‌నే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేక‌ర్స్ ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ వింటేజ్ మెలోడి త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ తెలిపారు.

కోన‌సీమ, అమ‌లాపురం త‌దితర ప్రాంతాల్లో 50 రోజుల‌కు పైగానే ఈ సినిమాను చిత్రీక‌రించారు.

న‌టీన‌టులు :

ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్, శ్రీమాన్, దీపిక్ ప్రిన్స్, త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :

ఎడిట‌ర్: గ్యారీ బి.హెచ్
సినిమాటోగ్రాఫ‌ర్: సాయికుమార్ దార
మ్యూజిక్: శ్రవణ వాసుదేవ‌న్
నిర్మాత: అహితేజ బెల్లంకొండ
రైట‌ర్ – డైరెక్ట‌ర్: సాయి మోహ‌న్ ఉబ్బన.