శృతి హాసన్ క్యారెక్టర్ పోస్టర్ షేర్ చేసిన అడివి శేష్

Published On: December 16, 2023   |   Posted By:

శృతి హాసన్ క్యారెక్టర్ పోస్టర్ షేర్ చేసిన అడివి శేష్

శృతి హాసన్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ పోస్టర్ ఫస్ట్ లుక్‌ ను షేర్ చేసిన అడివి శేష్

వరుస హిట్‌లతో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించిన అడివి శేష్, తన అప్ కమింగ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా #SeshExShruti కోసం హీరోయిన్ శ్రుతి హాసన్‌తో జతకట్టనున్నారు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఒక్కో పోస్టర్‌తో క్యురియాసిటీ మరింతగా పెరుగుతోంది! ఈ చిత్రం నుండి శృతి హాసన్ ఫస్ట్  గ్లింప్స్ శనివారం విడుదల చేశారు.ఈ గ్లింప్స్ సినిమా డైనమిక్ ప్రపంచంలోకి స్నీక్ పీక్‌ను అందిస్తోంది. శృతి హాసన్ స్వయంగా పరిచయం చేసిన అడివి శేష్ క్యారెక్టర్ పోస్టర్ తర్వాత ఈ కొత్త పోస్టర్ మూవీ రెండవ విజువల్ ఎస్సెట్.

ఈ తాజా పోస్టర్‌లో, శ్రుతి హసన్ తన కళ్ళలో కోపం, ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ, ఇంటెన్స్ ఎమోషన్స్ తో  ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 18న అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శ్రుతి హాసన్ పోస్టర్ ని పంచుకున్నారు. “ఆమె కళ్లలో కోపాన్ని చూడండి!  టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న విడుదల.  SeshEXShruti. @shrutzhaasanతో కలిసి పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బ్యుటీఫుల్ హార్ట్. బ్యుటీఫుల్ సోల్. అద్భుతమైన కెమిస్ట్రీ కోసం ఎదురు చూస్తున్నాను” అని రాశారు.

అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అడివి శేష్ కు రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుంది.

అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్ కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ కు ఆయన దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ-నిర్మాత. అడివి శేష్ , షానీల్ డియో కలిసి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.