శ్రీరామ్ నిమ్మల ప్రెస్ మీట్

ఇలాంటి కథలు తెరమీద చూసి చాలా కాలం అవుతుంది… హీరో శ్రీరామ్ నిమ్మల


శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందినసినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ముస్తాబయ్యింది.
 
ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ నిమ్మల మీడియా తో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ:
 
‘‘సినిమాల్లోకి రావాలనే నా ప్రయత్నాలకు ‘ఉత్తర’ తో బ్రేక్ పడింది. ఎటువంటి సినిమా నేపథ్యం లేదు,కానీ సినిమాల్లోకి రావాలనే ఇష్టంతో ప్రయత్నాలు చేసాను ఉత్తర లో సెలెక్ట్ అవ్వడం,  న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్ తో పరిచయం అవడం నా అదృష్టం. ఈ కథలో కొత్త దనం కంటే మన కథ అని ఫీల్ అయ్యే అంశాలు ఎక్కువుగా ఉంటాయి. అందరూ రిలేట్ అయ్యే సన్నివేశాలు, పాత్రలు ఉత్తర ను కనెక్ట్ చేస్తాయి. మా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న దర్శకుడు మేం షూట్ చేసిన నిజామాబాద్ , దుండిగల్ ప్రాంతాలలోని సహాజత్వం తెరమీదకు తెచ్చారు. పాడు బడిన గోడలు, పల్లెల్లో ఇరుగ్గా కనిపంచే సందుగొందులలో కథ ను చాలా సహాజంగా నడిపారు. ఊళ్లో ఖాళీగా తిరిగే అబ్బాయి జీవితంలో కి వచ్చిన స్వాతి అనే అమ్మాయి అతని జీవితాన్ని ఎలా మార్చింది..? అలాగే కూతరు ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఒక్కామాట అనకుండా, చేయెత్తకుండా కూతరు తీసుకున్న నిర్ణయం లోని తప్పు ఒప్పులను తెలిసేలా చేస్తాడు ఆమె తండ్రి ఆ పాత్ర ను చాలా హుందాగా తీర్చి దిద్దారు దర్శకుడు. దీనితో పాటు అజయ్ ఘోష్ మాత్ర కూడా చాలా కనెక్టింగ్ గా ఉంటుంది. హీరోగా అనేకంటే ఎక్కువమంది అందరూ రిలేట్ అయ్యే కుర్రాడి పాత్రగా ఉంటుంది. ఇక హీరోయిన్ కారుణ్య నాకంటే బాగా ఎక్స్ పీరియన్స్డడ్ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఆమెతో డాన్స్ విషయంలో కాస్త టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ యాక్టింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాను. ఆమె పాత్ర చాలా ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుంది. కాస్త అందం ఉండే అమ్మాయిలకుండే పోగరు , ఆ యాట్యిట్యూడ్ తో హీరోను ముప్పుతిప్పలు పెడుతుంది అవన్నీ స్ర్కీన్ మీద చాలా ఫన్ ని క్రియేట్ చేస్తాయి. లంకె బిందెలు కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈజీ మనీ కోసం ట్రై చేసే యూత్ లంకె బిందెలు కోసం చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. సురేష్ బొబ్బిలి ఇచ్చిన పాటలు మా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. జనవరి 3 న విడుదల అవుతున్న ‘ఉత్తర’ తప్పకుండా అందరినీ అలరిస్తుందని  ’’ అన్నారు.


రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర జనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది. ఈ మవీ  ట్రైలర్ కి మంచి రెస్సాన్ వస్తుంది. ఒక స్వచ్చమైన ప్రేమకథను, రియలిస్టిక్ అప్రోచ్ తెరమీదకు తెచ్చిన ఈమూవీ తప్పకుండా అన్ని వర్గాల వారినీ అలరిస్తుందని అంటుంది చిత్ర యూనిట్.

సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.


నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్,
అభయ్ తదితరులు.