శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 చిత్రం ప్రారంభంధ‌ర్మ‌, పవి హీరో హీరోయిన్లుగా శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా నూత‌న చిత్రం రూపొందుతోంది. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో అనుభ‌వం ఉన్న నిర్మాత ప్ర‌వీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఆలోచింప‌జేసే క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల‌కు సినిమాటొగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు.

ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు  హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ కొట్ట‌గా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీ విష్ణు, ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేక‌ర్స్‌కు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి  నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజ‌రయ్యారు. డిసెంబ‌రు చివరి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

తారాగ‌ణం: ధ‌ర్మ‌, పవి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి
నిర్మాత‌: జె. ప్ర‌వీణ్ రెడ్డి
సంగీతం: గౌర హ‌రి
సినిమాటోగ్రఫీ: కేశవ
క‌థ‌: కిషోర్ శ్రీ కృష్ణ‌
ఎడిట‌ర్‌: జెస్విన్ ప్ర‌భు