శ్రీ విష్ణు SV18 చిత్రం ప్రకటన

Published On: February 29, 2024   |   Posted By:

శ్రీ విష్ణు SV18 చిత్రం ప్రకటన

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, శ్రీ విష్ణు, కార్తీక్ రాజు, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్, #SV18 గ్రాండ్ రివీల్

ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న హీరో శ్రీవిష్ణు, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్ డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే అతని నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది . గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#SV18  గ్రాండ్ రివీల్ వీడియో ద్వారా చేశారు. గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి గిఫ్ట్  అందుతుంది. గిఫ్ట్ బాక్స్ లోపల ఒక పజిల్ ఉందని తెలుసుకున్న శ్రీ విష్ణు ఆ  పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు. చాలా కాలంగా బిగ్ బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది ఖచ్చితంగా బిగ్ బర్త్ డే ప్రెజెంటేషన్.

#SV18 ఒక మంచి ప్రేమకథతో పాటు ఫన్ రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతుంది. ప్రముఖ టెక్నీషియన్లు ఈ క్రేజీయస్ట్ కాంబినేషన్ లో సినిమా కోసం పని చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

తారాగణం: శ్రీవిష్ణు

సాంకేతిక విభాగం:
సమర్పణ: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి
బ్యానర్స్: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్