సిరిమల్లె పువ్వా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

Published On: February 5, 2023   |   Posted By:

సిరిమల్లె పువ్వా  చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

గ్రాండ్ గా జరిగిన “సిరిమల్లె పువ్వా” ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 10 న  గ్రాండ్ రిలీజ్

ప్రజలను దోచుకోవడం కాదు – ప్రజలను కాచుకునే నాయకుడిగా.. గెలవాలని, నిలవాలని,మిగలాలనీ, తలచే, తపించే ఓ నిస్వార్ధ నాయకుడి రాజకీయ జీవన ప్రవాసంలోకి, ఆయన కొడుకు హృదయంలోకి అడుగిడిన ఓ అడవిమల్లి జీవితంలోకి మరొక దుష్ట రాజకీయ నాయకుడి చెరను చేదించుకొని ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడి ఓ స్వచ్ఛమైన సిరిమల్లెలా ఎలా విరిసి వికసించిందనే అంశాలతో పాటు గిరిజన నేపథ్యంలో సాగిన ఓ భిన్నమైన రాజకీయ  ప్రేమ కథే “సిరిమల్లె పువ్వా”.

 

షకీరా  మూవీస్ పతాకంపై శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్,  షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మైలవరం దర్శకత్వంలో కౌసర్  జహాన్ నిర్మించిన  చిత్రం  “సిరిమల్లె పువ్వా”.

 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన  ప్రముఖ డైరెక్టర్ చంద్రమహేష్ , డైరెక్టర్ సముద్ర,
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ లు.

ఈ చిత్రంలోని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. ఇంకా, మా ఈ. సి. మెంబెర్ సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్, నిర్మాత పద్మిని నాగులపల్లి, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్రతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  నుండి వచ్చిన పలువురు డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం

డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ.. మంచి టైటిల్ తో వస్తున్న “సిరిమల్లె పువ్వా” చిన్న సినిమా అయినా కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర దర్శక, నిర్మాతలకు  మంచి పేరును తీసుకు వస్తుంది. చిత్ర దర్శకుడు గౌతమ్ గారికి సినిమా అంటే ఎంతో ఇష్టం. తను  మంచి కథ రాసుకొని సినిమా తియ్యాలనే ప్యాషన్ తో తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను నిర్మాత కౌసర్  జహాన్ చాలా చక్కగా నిర్మించారు. మంచి కథ, మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ ..చిత్ర దర్శకులు  గౌతమ్,  నాకు చాలా మంచి ఫ్రెండ్..అలాగే నిర్మాత జహాన్ గారు కూడా చాలా రోజులుగా పరిచయం. వీరికి సబ్జెక్టు పట్ల, సాంగ్స్ పట్ల మంచి అవగాహన ఉంది.ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్  కుదిరారు. అలాగే నాకు ఇష్టమైన నందమూరి హరి గారి అబ్బాయి నందమూరి తారకరామారావు ఈ సినిమాకు ఎడిటింగ్ చేశాడు. మ్యూజిక్ చాలా బాగుంది . ఫిబ్రవరి 10 న మంచి కథతో వస్తున్న “సిరిమల్లె పువ్వా” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. “సిరిమల్లె పువ్వా” టైటిల్ చూస్తుంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు గౌతమ్ కూడా చాలాసాఫ్ట్ గా ఉంటాడు. లోపల చూస్తే మల్టీపుల్ గా నక్సలిజం యాంగిల్ గాని, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గాని  అనేలా విపరీతంగా ఉంది. ఇందులో మాస్, యాక్షన్  ఇలా అన్ని రకాలుగా ఉన్న  ఈ సినిమాలో సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత కౌసర్  జహాన్ కూడా ఎక్కడా ఖర్చుకు వెనుకాడ కుండా ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు.ఇందులో హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు. నందమూరి హరి గారు ఎంత గొప్ప ఎడిటరో మనందరి  తెలుసు.. ఈ రోజు వారి అబ్బాయి  నందమూరి తారకరామారావు ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేయడం చాలా హ్యాపీగా ఉంది..ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు ఏరి కోరి మంచి టెక్నిషియన్స్ సెలెక్ట్ చేసుకొని, సిరిమల్లె పువ్వా అని మంచి టైటిల్ పెట్టుకొని తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

చిత్ర నిర్మాత కౌశర్ జహాన్  మాట్లాడుతూ ..మా “సిరిమల్లె పువ్వా సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. కరోనా కారణంగా  మేము ఈ సినిమా విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాము. దర్శకులు  గౌతమ్ గారు సినిమా ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలానే ఒక ఆలోచనతో, ఆశయంతో వచ్చి నాకు స్టోరీ వినిపించాడు. జర్నలిస్ట్ అయిన నేను సమాజానికి ఏదైనా చెయ్యాలి చెప్పాలి అనుకున్న టైం లో  గౌతమ్ గారు ఈ కథ  చెప్పడంతో నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది.దాంతో గౌతమ్  గారు సినిమా అనే కలను నెరవేర్చుకోవాలనే తపనతో తన ఉద్యోగాన్ని సైతం వదిలి ఈ సినిమా చేశాడు..ఇక  సినిమా విషయానికి వస్తే  ఒక ట్రైబల్ అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది. ట్రైబల్ పీపుల్స్ అంటే అణగారిన వర్గానికి చెందినవారు, బడుగు, బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లో  అణచి వేతకు గురవుతూ ఉంటారు.అలాగే వీరు అగ్ర వర్ణాల  వారిని ప్రేమిస్తే వారిని అణిచి వేయడం, లేక అదేదో మహా పాపమైనట్టు  వారిని చంపేయడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఈ సినిమాలో కూడా ఒక ట్రైబల్ అమ్మాయి  ఒక అబ్బాయిని స్వచ్చంగా ప్రేమిస్తే ఎన్ని ఇబ్బందులు పడింది, అలాగే అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయం. ఏమిటి అనేదే  చూపిస్తూ  ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మంచి కథతో ఈ నెల 10 న వస్తున్న మా సినిమాను అందరూ చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకులు గౌతమ్ మాట్లాడుతూ. .నాకు మొదట నుండి కళా రంగం అంటే ఎంతో ఇట్రెస్ట్ ఉండేది. నాకున్న అభిరుచి ని గుర్తించి   నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత కౌసర్  జహాన్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు అన్నారు.

నిర్మాత పద్మిని నాగులాపల్లి మాట్లాడుతూ .. శ్రీదేవి నటించిన సిరిమల్లె పువ్వా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో  మనందరికీ తెలిసిందే.. అలాంటి మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. ఇందులో పాటలు  బాగున్నాయి. కెమెరా పనితనం  చాలా బాగుంది. ఫిమేల్  ప్రొడ్యూసర్ అయిన కౌసర్  జహాన్ గారు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని ఆన్నారు.

హీరో శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ .. 2019 లో స్టార్ట్ అయిన మా మూవీ 2023 లో రిలీజ్ అవుతుంది.అంటే ఈ  సినిమాకు ఎంత స్ట్రగుల్ పడ్డామో మాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా మా నిర్మాత జహాన్  గారు ఈ సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. ఇలాంటి మంచి కథలో నన్ను, సెలెక్ట్  చేసుకొన్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ నిక్కీ శ్రావణి మాట్లాడుతూ ..ఫిబ్రవరి 10 న విడుదల అవుతున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం  ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

సీనియర్ ఆర్టిస్ట్ మాణిక్ మాట్లాడుతూ… ఈ సినిమా కెమెరా పని తనం చాలా బాగుంది. నటీ నటులు అందరూ  చాలా బాగా నటించారు. .మంచి టైటిల్ తో  వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటీనటులు
శ్రీకర్ కృష్ణ,  శ్రావణి నిక్కీ,  అజయ్ ఘోష్, ఆజయ్ నాయుడు,  అమ్మ రమేష్, షఫీ క్వాద్రి, అల్లు రమేష్ రాజేశ్వరి, ఓంకార్ నాథ్, శ్యామ్, కళ్యాణ్,  షఫీ సిరిపురం, రాజారావు ఆరంగి పురం, వర్ధని, రమ్య శ్రీ, లక్ష్మి, వీణ సరస్వతి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : షకీరా మూవీస్
ప్రొడ్యూసర్ కౌసర్ జహాన్
డైలాగ్స్, రైటర్,  డైరెక్టర్ : గౌతమ్ మైలవరం
ఎడిటర్ : నందమూరి తారకరామారావు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సత్యానంద్ వి
మ్యూజిక్ డైరెక్టర్ : జీబు
సింగర్ : బి సౌజన్య,బి శిరీష
డాన్స్ మాస్టర్ : అనీష్