సి 202 చిత్రం ట్రైలర్ విడుదల

Published On: February 22, 2024   |   Posted By:

సి 202 చిత్రం ట్రైలర్ విడుదల

మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో  మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.
అయితే ఈరోజు ఒక డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్ తో రెండు నిమిషాల ఎనిమిది సెకెన్ల ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ను సొంత బ్యానర్ మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) యూట్యూబ్ ఛానల్ లో ప్రేక్షకులకి అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ “ఈరోజు ‘సి 202’ (C 202) చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసాం. ఒక డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్ లను చూపిస్తూ మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మా సినిమా మీద అంచనాలు పెంచేలా రూపొందించాము. మా ట్రైలర్ కి ‘సౌండ్ ఆఫ్ సి 202 (Sound of C 202) అని పిలుచుకుంటున్నాము. మా ట్రైలర్ ని మంచి సౌండ్ సిస్టమ్ తో చూడండి, ఖచ్చితంగా మా ‘సి 202’ (C 202) చిత్రం మీద మీ అంచనాలు పెరుగుతాయి.
మా ‘సి 202’ (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాము. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించాము. మా చిత్రం లో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తారు. ఈ చిత్రంలో 21 నిమిషాల గ్రాఫిక్ ఉంటాయి. మా సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు
చిత్రం పేరు :  ‘సి 202’ (C 202)
బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures)
నటి నటులు : మున్నా కాశి, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, తదితరులు
కెమెరా మాన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దత్తు ఎమ్
కో ప్రొడ్యూసర్ : చిన్నయ్య కొప్పుల, అలివేణి వొల్లేటి, ఆనంద్ వేమూరి
నిర్మాత : మనోహరి కె ఎ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశి