సీతారామం మూవీ రివ్యూ

Published On: August 6, 2022   |   Posted By:

సీతారామం మూవీ రివ్యూ

Sita Ramam:దుల్కర్ సల్మాన్  ‘సీతా రామం’  రివ్యూ
Emotional Engagement Emoji (EEE)

👍

మహానటి చిత్రంతో తెలుగు వాళ్లకి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ….ఈ సారి తెలుగులో సోలోగా స్ట్రైయిట్ సినిమాతో పలకరించాడు. అలాగే  నటిగా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది. వీళ్లిద్దరి కాంబినేషన్ కు రష్మిక సైడ్ కిక్ లా సెట్టైంది. దాంతో క్రేజ్ పీక్స్ కు వెళ్ళింది. దానికి తోడు ఇది కూల్ లవ్ స్టోరీ కావటం,త పెద్ద బ్యానర్ నిర్మించటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వాటిని చాలా వరకూ ఈ సినిమా నిలబెట్టుకుందనే చెప్పాలి. మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్న ఈ సినిమా కథేంటి…జనాలను ఆకట్టుకున్న అంశాలు ఏమిటనే విషయం చూద్దాం.

కథ

లెఫ్టినెంట్ రామ్ (దుల్ఖర్ సల్మాన్) ఓ అనాధ. అతను  హైదరాబాద్‌లో ఉండే సీతామహాలక్ష్మి (మృణాళ్ ఠాకూర్) కి ఓ ఉత్తరం రాస్తాడు. కానీ అది ఆమెకు చేరదు. పాకిస్దాన్ లో గత ఇరవై ఏళ్లుగా ఉండిపోతుంది.  దాన్ని సీతకి అప్పగించే బాధ్యత ఆఫ్రిన్ (రష్మికామందణ్ణ)పై తీసుకుంటుంది. ఆమె   పాకిస్తాన్‌ ఆర్మీ అధికారి(సచిన్‌ ఖేడ్కర్‌) మనవరాలు. ఆ ఉత్తరం ఖచ్చితంగా అందచేయాల్సిన పరిస్దితి. అది సీతను వెతికి ఇవ్వకపోతే ఆమెకు తన తాత ఆస్దిలో పైసా కూడా దక్కదు. వేరే దారి లేక ఆమె ఆ ఉత్తరం పట్టుకుని హైదరాబాద్ లో లాంచ్ అవుతుంది. ఆమె సీతను వెతకటం మొదలెడుతుంది. ఈ క్రమంలో అసలు ఆ ఉత్తరంలో ఏముంది..అంత ముఖ్యమైన ఉత్తరమా అది…అసలు అంత ఇంపార్టెంట్ ఉత్తరం పాకిస్దాన్ లో పాతికేళ్లు ఎందుకు ఉండిపోయింది….అఫ్రిన్ ఆ ఉత్తారాన్ని చేరవేయగలిగిందా…సీతకు రామ్ కు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి….అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

రొమాంటిక్ లవ్ స్టోరీ చూడటమనేది యూత్ కపుల్స్ కు పాపులర్ ఛాయిస్. అందులో మినహాయింపు ఏమీ లేదు. వాళ్లు తమ ఫాంటసీలను తెరపై చూస్తూ ఎక్సపీరియన్స్ చేస్తూంటారు. అందుకే రొమాన్స్ అనేది సినిమాలో ఓ అంతర్గం అయ్యిపోయింది. అయితే రొమాంటిక్ లవ్ స్టోరీలకు మెయిన్ ఫోకస్ …దేనిపై ఉంటుంది. ఇద్దరు కళ్లల్లోకి చూసుకుని ప్రేమలో పడతారా …లేక సహజీవనం చేస్తూ ప్రేమించుకుంటారా…. అయితే ఏదైనా సినిమాల్లో చూపించినంత ఈజీ మాత్రం జీవితంలో కాదు. కానీ ఒక్కోసారి జీవితాన్ని అనుసరించే ప్రేమ కథలు తెరకెక్కుతూంటాయి. వానిటి జనం హృదయాలకు హత్తుకుంటారు. అలా చేద్దామని ఈ చిత్రం డైరక్టర్ ట్రై చేసారని మనకు ప్రతీ షాట్ లో అర్దమవుతుంది.  2010 లో వచ్చిన “లెటర్స్ టు జూలియట్” సినిమాలోని ఓ లెటర్ దొరకటం…దాన్ని అసలు వాళ్లకు ఇవ్వాలని వెతకులాడటం అనేది తీసుకుని…back and forth స్క్రీన్ ప్లే తో ముందుకు వెనెక్కి వెళ్తూ కథను నేరేట్ చేసారు. ఈ కథలో డ్రామా ని స్క్రీన్ ప్లేతో పుట్టించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా సస్పెన్స్ ఈ సినిమాని చివరి దాకా నిలబెట్టింది. ప్యూర్ లవ్ స్టోరీ గా ఈ సినిమాని నేరేట్ చేసి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా ఏదో ఒక దశలో విసుగెత్తించేది. అప్పటికీ స్లో నేరేషన్ కొంతవరకూ ఇబ్బందిగా మారింది. ట్విస్ట్ లు ఉండటంతో మ్యాజిక్ చేయగలిగింది. మామూలు కథనే కొద్ది పాటి ట్విస్ట్ లతో , అందమైన విజువల్స్ తో నిలబెట్టారు.  అయితే మధ్య మధ్యలో వెన్నెల కిశోర్‌, సునీల్‌ కామెడీ పండించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్‌ కాలేదు. అలాంటివి ప్రక్కన పెట్టేయాల్సింది.

టెక్నికల్ గా …

సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మెయిన్ ఫిల్లర్స్ గా నిలబడి మోసాయి. పాటలు ఇమ్మీడియట్ గా జనాల్లోకి వెళ్లవు కానీ మెల్లిగా ఎక్కుతాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ ని రిప్రజెంట్ చేసింది. ఇక దర్శకుడుగా హను రాఘవపూడి ఎప్పటిలాగే మణిరత్నం ను అనుకరించే ప్రయత్నం చేస్తూ వెళ్లారు. కెమెరా వర్క్ కూడా సినిమాకు బ్యాటిఫుల్ గా కుదరింది. కాశ్మీర్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి. రైటర్ గా హను రాఘవపూడి ఈ సినిమా మాగ్జిమం సక్సెస్ అయ్యారు.

నటీనటుల్లో …. లెఫ్ట్‌నెంట్‌ రామ్‌ గా దుల్కర్‌ సల్మాన్‌  ఫెరఫెక్ట్ ఛాయిస్.  ఎమోషనల్‌ సీన్స్‌లో పీక్స్ కు వెళ్లాడు. ఇక సీత గా మృణాల్‌ …దుల్కర్ కు పోటీ ఇచ్చింది.  మత పిచ్చి, పొగరు ఉన్న అమ్మాయి అఫ్రిన్‌గా రష్మిక సినిమాకు మరో ప్లస్ అయ్యింది. ఆర్మీ అధికారి విష్ణుశర్మగా సుమంత్‌ కథకు డెప్త్ తెచ్చారు.    తరుణ్‌ భాస్కర్‌, ప్రకాశ్‌ రాజ్‌, గౌతమ్‌ మీనన్‌ తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు.

ప్లస్ లు :
లీడ్ యాక్టర్స్ ఫెరఫార్మెన్స్
విజువల్స్
మ్యూజిక్

మైనస్ లు :

పేలని కామెడీ
ఫస్టాఫ్ లో స్లో నేరేషన్
క్లైమాక్స్ ప్రెండిక్టబుల్ గా అనిపించటం

చూడచ్చా?
ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. ఓ మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెస్ట్ ఆఫ్షన్

బ్యానర్: స్వప్న సినిమా
తారాగణం: దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ – రష్మిక మందన్న – సుమంత్ – గౌతమ్ మీనన్ – ప్రకాష్ రాజ్ – భూమికా చావ్లా – తరుణ్ భాస్కర్ – శత్రు – సచిన్ ఖేడేకర్ – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ తదితరులు
ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: హను రాఘవపూడి
సమర్పణ: వైజయంతీ మూవీస్
నిర్మాతలు: అశ్వినీదత్, ప్రియాంక దత్
Run Time:2 hr 43 mins
విడుదల తేదీ: 5 ఆగస్ట్, 2022