సుందర్ సి దర్శకత్వంలో చీకటి చిత్రo
 
ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి -‘చీకటి’ నిర్మాత సజ్జు
 
‘ఈ రోజుల్లో, ప్రేమకథాచిత్రమ్, నవమన్మధుడు’ వంటి చిత్రాల డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమలో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు సజ్జు. అనంతరం నిర్మాతగా మారి.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’తోపాటు.. ‘కిల్లర్, బేతాలుడు, మిస్టర్ కెకె’ వంటి అనువాద చిత్రాలు అందించారు. ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ను తెలుగులో ‘చీకటి’ పేరుతో అనువదిస్తున్నారు. 
     
 
మే 24 తన జన్మదినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న చీకట్లు త్వరలోనే తొలగిపోవడం ఖాయమన్నారు. కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో అందిస్తున్న సహాయ కార్యక్రమాలు అందరికి మనోబలాన్ని ఇచ్చాయన్నారు. తాను తాజాగా అనువదిస్తున్న ‘చీకటి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.