సుల్తాన్ ఆఫ్ దిల్లీ వెబ్ సిరీస్ అక్టోబర్ 13 విడుదల

Published On: October 12, 2023   |   Posted By:

సుల్తాన్ ఆఫ్ దిల్లీ వెబ్ సిరీస్ అక్టోబర్ 13 విడుదల

నా లుక్ ఆడ్రీ ,మార్లిన్ మన్రోచే ప్రేరణ పొందింది – మెహ్రీన్‌ పిర్జాదా

అధికారానికి మార్గం, హృదయాన్ని కదిలించే స్నేహం, 60ల నాటి ఆకర్షణ, డిస్నీ+ హోస్టార్ రాబోయే పవర్-ప్యాక్డ్ సిరీస్, సుల్తాన్ ఆఫ్ దిల్లీలో ఇవన్నీ ఉన్నాయి. అర్నాబ్ రే రచించిన సుల్తాన్ ఆఫ్ దిల్లీ: అసెన్షన్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. మిలన్ లుత్రియా దర్శకత్వం వహించారు. సుపర్న్ వర్మ సహ-దర్శకత్వం, సహ-రచయిత. పురాతన భారతదేశ శోభను మళ్లీ ప్రతిబింబిస్తూ తెరపై అ ద్భుత దృశ్యాన్ని సృష్టిస్తూ, మిలన్ లుత్రియా తొలిసారిగా ఓటీటీ దర్శకుడిగా ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్, సుల్తాన్ ఆఫ్ దిల్లీతో అరంగేట్రం చేశారు. ఇది 13 అక్టోబర్ 2023న విడుదల కానుంది. ఈ ధారావాహికలో తా హిర్ రాజ్ భాసిన్, అంజుమ్ శర్మ, ప్రముఖ నటుడు వినయ్ పాఠక్‌తో పాటు నిశాంత్ దహియా, అనుప్రియ గో యెంకా, మౌని రాయ్, హర్లీన్ సేథీ, మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఒక పరిపూర్ణమైన సమిష్టి తారాగణం ఇం దులో కనిపిస్తుంది.

మెహ్రీన్ పిర్జాదా: నా లుక్ ఆడ్రీ, మార్లిన్ మన్రోచే ప్రేరణ పొందింది, ఇది నాకు చాలా కూల్‌గా అనిపించింది మిలన్ లుథ్రియా దర్శకత్వానికి సంబంధించిన సిగ్నేచర్ స్టైల్‌లలో ఒకటి అతని ప్రతి పాత్ర యొక్క ప్రత్యేక రూపం. సుల్తాన్ ఆఫ్ దిల్లీలో సంజన పాత్రను పోషించిన మెహ్రీన్ పిర్జాదా, పోల్కా డాట్ డ్రెస్‌లు, సిల్క్ లాంగ్ స్కర్ట్‌ ల నుండి ఎగిరి పడే బాబ్ హెయిర్-డాస్ వరకు 60ల నాటి క్లాసిక్ లుక్‌ను కలిగిఉంటుంది.

ఈ షోలో తన లుక్, స్టైల్ గురించి మెహ్రీన్ పిర్జాదా మాట్లాడుతూ, నేను సుల్తాన్‌ ఆఫ్ దిల్లీ లో నా లుక్‌ని ఇష్ట పడ్డాను. ఆ కాలంలో జుట్టు రంగు అంతగా ప్రాముఖ్యంలేదు. అందుకే జుట్టుకు కలర్ వేయడానికి బదులు గా నేను విగ్ ధరించాను. 50, 60ల నాటి దుస్తులే ఎంతో కూల్ లుక్‌ని ఇచ్చాయి. ఇది ఆడ్రీ, మార్లిన్ మన్రోలచే ప్రేరణ పొందింది. నేను వాళ్ల సినిమాలను చాలా వరకు చూసినందున ఇది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. లిప్ కలర్స్, బూట్లు వంటివి మిలన్ సర్ కు ఓ పట్టాన నచ్చలేదు. దాంతో నేను ఎన్నో లుక్ టెస్ట్ లు చేయిం చుకున్నాను. సంజన నిజంగా మెరిసిపోయే ఎరుపు రంగులో ఉండే పెదవుల రంగులను ధరించాలని మొద ట్లో ఆయన అనుకున్నారు, కానీ ఎంతో అమాయకత్వంతో ఉండే సంజన వంటి పాత్రకు తటస్థ రంగులు, సహ జమైన మేకప్ ఉన్న బాగా సరిపోతాయని ఆయన గ్రహించారు. అందుకే బేస్ ఎంతో సింపుల్ గా ఉంది, అంతే కాదు, అధునాతనమైంది, ఫ్యాషన్‌గా కూడా ఉంది అని అన్నారు.

సుల్తాన్ ఆఫ్ దిల్లీ 13 అక్టోబర్, 2023 నుండి ప్రత్యేకంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది