సోదర సోదరీమణులారా మూవీ ట్రైలర్ విడుదల

Published On: September 11, 2023   |   Posted By:

సోదర సోదరీమణులారా మూవీ ట్రైలర్ విడుదల

ఉత్కంఠ రేపేలా సోదర సోదరీమణులారా థియేట్రికల్ ట్రైలర్. వినాయక చవితి కి సెప్టెంబర్ 15న సినిమా గ్రాండ్ రిలీజ్

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించిన సోదర సోదరీమణులారా..ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. వర్ధన్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి కెమెరామెన్ గా, పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు:

కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ తారాగణం కనిపించనుంది

సాంకేతిక నిపుణులు :

రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి గుండా
నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
నేపథ్య సంగీతం : వర్ధన్
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి