స్టన్నింగ్‌ పోస్టర్‌ తో దసరా శుభాకాంక్షలు చెప్పిన నందమూరి కల్యాణ్‌రామ్‌ డెవిల్‌ టీమ్‌

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో కల్యాణ్‌రామ్‌ ప్రతిభావంతుడనే విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. పాత్రలను, కథలను ఆయన ఎంపిక చేసుకునే విధానం అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ప్రయోగాలకు వెనకాడకుండా, ఆత్మస్థైర్యంతో తనదైన అభిరుచిని ప్రదర్శిస్తూ స్కిప్ట్ లు సెలక్ట్ చేసుకుంటుంటారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఇప్పుడు డెవిల్‌తోనూ ఆ విషయాన్ని మరోసారి నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. డెవిల్‌ అనే ఫెరోషియస్‌ టైటిల్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించేశారు కల్యాణ్‌రామ్‌. ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకొచ్చేస్తోంది డెవిల్‌. అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్‌.
ఇటీవల విడుదలైన డెవిల్‌ టీజర్‌కి సర్వత్రా మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంచనాలు పెంచేసింది టీజర్‌. ఈ ఏడాది నవంబర్‌ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రతి పోస్టరూ ఆకట్టుకుంటోంది.

దసరా శుభసందర్భంగా అభిమానులను స్పెషల్‌ పోస్టర్‌తో విష్‌ చేశారు నందమూరి కల్యాణ్‌రామ్‌.
ఈ తాజా దసరా పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో అదుర్స్ అనిపిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పర్వదినంగా జరుపుకుందాం. అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఆనందాలు, శుభాలు వెల్లివిరియాలి అని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.

అభిషేక్‌ పిక్చర్స్ పేరు చెప్పగానే అందరికీ అత్యద్భుతమైన నిర్మాణ విలువలు కళ్ల ముందు మెదులుతాయి. డెవిల్‌లోనూ అద్భుత ప్రమాణాలు కళ్లకు కట్టినట్టు ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకులకు నయనానందం కలిగించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గాంధీ నడికుడికార్‌ క్రియేట్‌ చేసిన విజువల్స్ స్టన్నింగ్‌గా అనిపిస్తాయి. అత్యద్భుతమైన దృశ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది ప్రేక్షకులకు. సౌందర రాజన్‌.యస్‌. కెమెరా పనితనం, తమ్మిరాజు ఎడిటింగ్‌ సినిమాకు సిల్వర్‌ స్క్రీన్‌ మీద గొప్ప జీవం పోసేలా ఉంటాయి.
శ్రీకాంత్‌ విస్సా రాసిన కథ, స్క్రీన్‌ ప్లే, మాటలకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కితీరుతాయి. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి మాటనూ అద్భుతంగా మలిచారు శ్రీకాంత్‌. పీరియడ్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది డెవిల్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలను ప్రేక్షకులకు పంచుకుంటామని అంటున్నారు మేకర్స్.
ఎ ఫిల్మ్ బై అభిషేక్‌ పిక్చర్స్

నటీనటులు :

నందమూరి కల్యాణ్‌ రామ్‌, సంయుక్త తదితరులు

సాంకేతికవర్గం :

సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్
సమర్పణ: దేవాంశ్‌ నామా
నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా
కెమెరా: సౌందరరాజన్‌
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
ఎడిటర్‌: తమ్మిరాజు