హంట్ మూవీ రివ్యూ 

Published On: January 26, 2023   |   Posted By:

హంట్ మూవీ రివ్యూ 

సుధీర్ బాబు ‘హంట్’ రివ్యూ
Emotional Engagement Emoji

హిట్ ,ప్లాఫ్ లతో సంభందం లేకుండా కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తూంటాడు సుధీర్ బాబు. అయితే ఆయనకు ఈ క్రమంలో తగిలిన ఎదురు దెబ్బలే ఎక్కువ. హిట్లే తక్కువ. అయినా తగ్గేదేలే అన్నట్లుగా ఆయన వెరైటి కథల హంటింగ్  ఈరోజు హంట్ సినిమా దాకా వచ్చింది. పదేళ్ల క్రితం వచ్చిన ముంబై పోలీస్ అనే మళయాళ చిత్రంలో ఉన్న వెరైటీ పాయింట్ కు మురిసిపోయి ముందుకు వచ్చి ఈ చిత్రం చేసాడు. అప్పట్లో ఆ సినిమా సెన్సేషన్. కాలం మారింది. కోవిడ్ వచ్చి వెళ్లింది. అయినా ఇప్పటికీ ఆ సినిమా మనని అలరిస్తుందా..ఈ జనరేషన్ నచ్చే కథేనా ..అసలు అంత వెరైటీ పాయింట్ ఆ సినిమాలో ఏముందో రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఇదో ట్విస్టెట్ ఇన్విస్టిగేషన్ కథ. ACP అర్జున్ (సుధీర్ బాబు) తన క్లోజ్ ప్రెండ్ ఆర్యన్ దేవ్ (భరత్)ని బహిరంగంగా స్టేజిపై కాల్చి చంపిన హంతకుడుని పట్టుకోవాలని ప్రయత్నిస్తూంటాడు.  ఆక్రమంలో ఇన్విస్టిగేట్ చేస్తున్న అతనికి  ఆ హంతకుడు ఎవరో తెలుస్తాడు. హంతకుడుని కనిపెట్టినట్టు పోలీస్‌ కమిషనర్‌ మోహన్‌ భార్గవ్‌ (శ్రీకాంత్‌)కు ఫోన్లో చెబుతుండగానే ప్రమాదానికి గురవుతాడు. దాంతో అతనికి పార్శియల్ మెమరీ లాస్ వస్తుంది. అయినా తన బాస్ మోహన్(శ్రీకాంత్) సూచన మేరకు తనే మళ్లీ ఆ కేసుని చేపట్టి తిరిగి ఇన్విస్టిగేషన్ చేపడతాడు.  కానీ తన మెమరీనే తనకు శత్రువు. అసలు తనెవరో తనకే తెలియని అర్జున్‌..కు గత జీవితం ఏమిటో తెలుసుకోవాలి. ఆ హంతకుడు ఎవరో కనుక్కోవాలి.  తన గత జీవితం గురించి తెలుసుకుంటూ మరోవైపు ఆర్యన్‌ హత్య కేసును చేధించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అనేక రహస్యాలు బయిటపడతాయి. వాటి ఆధారంగా అసలు హంతడుకు ఎవరో  అర్జున్ కనుక్కుంటాడు. అదో షాకింగ్ ట్విస్ట్ …అదేమిటి… అర్జున్ కు ఎదురైన ఆ సీక్రెట్స్ ఏమిటి..అలాగే ఆర్యన్‌ దేవ్‌ హత్య కేసుకు క్రిమినల్‌ రాయ్‌ (మైమ్‌ గోపీ), కల్నల్‌ విక్రమ్‌ (కబీర్‌ సింగ్‌), టెర్రరిస్ట్‌ గ్రూప్‌ హర్కతుల్‌కు ఉన్న సంబంధం ఏంటి?అసలు హంతకుడు ఎవరు..క్లైమాక్స్ లో  అర్జున్ కు మెమరీ వెనక్కి వచ్చిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …

ముందే చెప్పుకున్నట్లు …ఈ సినిమా మళయాళంలో 2013లో వచ్చి ముంబై పోలీస్ అనే చిత్రానికి రీమేక్. ఆ సినిమాలో ఊహించని ట్విస్ట్ మళయాళ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అక్కడ ఆ సినిమా బాగా ఆడింది..పేరు తెచ్చుకుంది. అయితే ఆ ట్విస్ట్ కి భయపడి తెలుగు వాళ్లు రిసీవ్ చేసుకుంటారో లేదో అని ఇన్నాళ్లు డబ్బింగ్ కానీ, రీమేక్ కానీ చేయలేదు. పదేళ్లకు కాస్త దైర్యం వచ్చి రీమేక్ రూపంలో ఇక్కడ దించారు. సుధీర్ బాబు  ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అయితే ఇప్పటికైనా మనవాళ్లు ఆ ట్విస్ట్ ని ఆదరిస్తారా…మళయాళీలలో లిటరసీ రేటు ఎక్కువ కాబట్టి ఆ ట్విస్ట్ ని అక్కడ సమాజంలో వచ్చిన మార్పులను గమనిస్తూ పదేళ్ల క్రితమే జై కొట్టారు. ఆ ట్విస్ట్ చెప్పేస్తే సినిమా  చూడటం కష్టం కాబట్టి స్పాయిలర్ ఎలర్ట్ క్రింద దాన్ని వదిలేస్తే ఈ సినిమా ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్. మెయిన్ ప్లాట్ ..ఫస్ట్ యాక్ట్ లోనే ఎస్టాబ్లిష్ చేసేసారు. ఓ పోలీస్ అధికారి బహిరంగంగా హత్యకు గురి అయ్యారు. అతని స్నేహితుడు (హీరో) దాన్ని ఇన్విస్టిగేషన్ కు పూనుకున్నాడు. ఆ క్రిమినల్ ఎవరో కనుక్కునే ప్రాసెస్ లో తన టెంపరరీ మెమరీ లాస్ ని జయిస్తూ ముందుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఊహించని ట్విస్ట్ లు ఎదురౌతాయి. ఓ డ్రామా క్రియేట్ అవుతుంది. మిస్టరీని ఛేదిస్తూ క్రిమినల్ ఎవరో కనుక్కుని మనకు షాక్ ఇస్తాడు.

సుధీర్ బాబు ఏ ఇతర హీరో చేయని థైర్యమే చేసాడు. అతను నిజాయితీగా తన సిన్సియర్ ఎఫెర్ట్ నే పెట్టాడు. అయితే సినిమా అనకున్న స్దాయిలో ఉండదు. చాలా చోట్ల బోర్ వచ్చేస్తుంది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని అక్కడ దాకా సాగతీసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా ప్రారంభం,క్లైమాక్స్  మాత్రమే మనను అటెన్షన్ లో కి తీసుకువస్తాయి. సినిమాలో చెప్పుకోదగ్గ  ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా..  ప్లే ఆ స్దాయిలో జరగదు. చాలా స్లోగా సాగుతుంది.  మంచి  కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ పరుగెత్తడు. ఆ బ్లాక్ లన్నీ  దర్శకుడు మహేష్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. మరో ప్రక్క సుధీర్ బాబు తాలూకు కొన్ని ఇన్విస్టిగేషన్ సీన్స్  మరీ సినిమాటిక్ గా సాగాయి. మొత్తానికి హంట్ చిత్రం మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారని అర్దమవుతుంది. చాలా సీన్స్ లో తేలిపోయారు.

ఈ సినిమాకు పెద్ద మైనస్ …పదేళ్ళ క్రితం సెన్సేషన్ గా నిలిచిన పాయింట్ ఈ రోజు కు అతి కామన్ థింగ్ గా మారిపోవటమే.   ముంబై పోలీస్ సినిమా క్లైమాక్స్ లో  ఒక సంచలనమైన ఎలిమెంట్ వుంది. అది తెలుగులో కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్మారు. దానికి అంత సీన్ లేదు అని తేలిపోయింది.  అలాగే ఒక మర్డర్  చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ డ్రామాకు టెంపో,ఇంటెన్స్ చాలా కీలకం.  స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటే చూసేవాళ్ళు అంతగా మూవీలో లీనమైపోతారు. అదీ ఈ సినిమాలో మిస్సైంది. డైరక్టర్ పూర్తిగా తడబడ్డాడు.  మలుపులు ఏమీ కూడా  మైండ్ బ్లోయింగ్ అనిపించేలా లేకపోవడం దెబ్బకొట్టింది.

టెక్నికల్ గా …

ఇలాంటి సస్పెన్స్ సినిమాలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ కాలేదు. అయితే ఉన్నంతలో అరుళ్ విన్సెంట్ కెమెరా వ్రక్ బాగుంది. క్వాలిటీ స్క్రీన్ మీద చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ని ల్యాగ్ ఉంది. బాగా స్లోగా ఉంది.  ఫైట్లు బాగున్నాయి. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రాజీ పడలేదు.  ప్రొడక్షన్ మీద బాగానే ఖర్చు పెట్టారు.

నటీనటుల్లో…
ఈ సినిమాలో సుధీర్ బాబుని కొత్తగా చూపెట్టడానికి ఏమీ లేదు. అతను ఆల్రెడీ పోలీస్ పాత్రలు చేసేసాడు. అయితే గతం మర్చిపోయి, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక క్లూలెస్ గా కనిపించేలా బాగా చేసారు. . శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, చిత్రా శుక్లా, కబీర్ సింగ్, మంజుల ఘట్టమనేని, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు.

ప్లస్ లు :
కొత్త తరహా క్లైమాక్స్ ట్విస్ట్;
సుధీర్‌బాబు యాక్టింగ్
ఫైట్స్

మైనస్ లు: –
అర్దం పర్దంలేని స్క్రీన్‌ప్లే,
మరీ బోర్ కొట్టిన ఫస్టాఫ్

చూడచ్చా

క్లైమాక్స్ ట్విస్ట్ ముందే తెలిసిన వారికి ఈ సినిమా సహన పరీక్షే. మిగిలిన వారికి జస్ట్ ఓకే

నటీనటులు : సుధీర్ బాబు, భరత్ నివాస్, శ్రీకాంత్, చిత్రా శుక్లా, ‘మైమ్’ గోపి, కబీర్ దుహాన్ సింగ్, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ తదితరులు
కథ, కథనం : బాబీ – సంజయ్
ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
రచన, దర్శకత్వం : మహేష్
Runtime:2 గంటల 12 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 26, 2023