హి మూవీ టైటిల్ పోస్టర్ విడుదల

Published On: October 31, 2023   |   Posted By:

హి మూవీ టైటిల్ పోస్టర్ విడుదల

హర్రర్ థ్రిల్లర్ హి టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు.

డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మాతగా శ్రీనివాస్ ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హి (హంట్స్ ఎవరిఒన్) హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం.

బిగ్ బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హి చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.