హీరో ప్రియదర్శి విలేకరుల ఇంటర్వ్యూ

Published On: March 18, 2024   |   Posted By:

హీరో ప్రియదర్శి విలేకరుల ఇంటర్వ్యూ

‘ఓం భీమ్ బుష్’ అందరినీ అలరించే క్లీన్ ఎంటర్ టైనర్. ఇందులోని ఎమోషనల్ ఎలిమెంట్ చాలా యూనిక్ గా వుంటుంది: హీరో ప్రియదర్శి

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’  మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ప్రియదర్శిగారు  ‘ఓం భీమ్ బుష్’  ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

దర్శకుడు హర్ష ‘హుషారు’ సినిమా నుంచే పరిచయం. నేను తన గత చిత్రాలలో పని చేయాల్సింది కానీ కుదరలేదు. ‘ఓం భీమ్ బుష్’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ అనేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే యువీ లాంటి బలమైన నిర్మాణ సంస్థ వుండటం.. ఇలా అన్నీ కుదిరాయి. కథలో చాలా ఇంట్రస్టింగ్ ఐడియా వుంది. దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ కూడా యాడ్ చేయడం ఇంకా క్రేజీగా అనిపించింది. అలాగే స్నేహితులతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర పేరు డా. వినయ్ గుమ్మాడి. మా ఫ్రెండ్స్ అంతా ఉస్మానియాలో పీహెచ్డీ చేయాలనీ చేరుతాం. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం అక్కడ వచ్చే స్టయిఫండ్ , ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం.  నాది సైన్స్ ని బిలివ్ చేసే పాత్ర. మిగతా ఇద్దరు మాత్రం మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. అలా మా ముగ్గురి మధ్య మంచి హ్యుమర్ వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. మధ్యలో మంచి ఎమోషనల్ పాయింట్ వుంది. అది యూనిక్ గా వుంటుంది. మేము ముగ్గురం కలసి బ్రోచేవారెవరురా చేశాం. దానికి ‘ఓం భీమ్ బుష్’ కి ఎక్కడా పోలిక వుండదు.

ఈ సినిమాలో మీకు హీరోయిన్ ఉందా ?

ఆయేషా ఖాన్ నా జోడిగా కనిపిస్తారు. అలాగని రొమాంటిక్ సాంగ్స్ ఏమీ వుండవు.

ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?

ఇది బడ్డీ కామెడీ మూవీ. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా అందరూ ఎంజాయ్ చేశా చాలా క్లీన్ గా సినిమా చేశాం.

మీ ముగ్గురు కలిసి చేసిన బ్రోచేవారెవరు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అనుకోవచ్చా?

ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అందులో ముగ్గురం కొంచెం మెచ్యూర్డ్ పాత్రలు. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటాం. కానీ ‘ఓం భీమ్ బుష్’ అలా కాదు. మేం ముగ్గురం తింగరి పనులు చేసి సమస్యలలో ఇరుక్కుంటాం. దానికి దీనికి చాలా తేడా వుంది. సీక్వెల్ కాదు.

మంగళవారం సినిమాలో ఓ ప్రధాన పాత్ర చేశారు కదా.. ఆ సినిమా తర్వాత హీరోగా కథలు ఎంచుకోవాలనే ఆలోచన వచ్చిందా ?

హీరోగా కంటే నన్ను నేను ఒక నటుడిగా చూసుకోవడానికి ఇష్టపడతాను. హీరో అనగానే ఒక ఇమేజ్ వస్తుంది. నటుడిగా వుంటే చాలా స్వేఛ్చగా ఒక నదిలా హాయిగా ప్రవహించవచ్చు. నటుడిగా వుంటే ఎక్కువ వైవిధ్యం చూపించవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది నా నమ్మకం. మంగళవారంలో కూడా ఒక ముఖ్యపాత్రగానే వుంటాను కానీ హీరోగా వుండను. ఇలాంటి మంచి పాత్రలు ఇస్తున్న రచయిత, దర్శకులు వుండటం నా అదృష్టం.

నిర్మాతల సహకారం ఎలావుంది?

సునీల్ గారు, వంశీ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. అద్భతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వుంటాయి. ఇందు భారీ మహల్ సెట్ వుంటుంది. ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్ వేశారు. అలాగే సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.  వారి సహకారంలేకుండా ఈ సినిమా గ్రాండ్ గా తీసేవాళ్ళంకాదు. ఇందులో గ్రీక్ తరహా గెటప్ లో ముగ్గురం వుంటాం. మాతో పాటు ఫారిన్ లేడీస్ నటించారు. ఇది ఓ పేలెస్ లో షూట్ చేశారు. ఆ  పాలెస్ పూనెకు డెబ్బ కిలోమీలర్ల దూరంలో వుండే థోర్ అనే ప్రాంతంలో వుంది. చాలా బ్రహ్మాండగా వచ్చింది.  ఈ నేపథ్యంలో ఓ సాంగ్ కూడా వుంటుంది. ఇదంతా డ్రీమ్ సాంగ్ లా వస్తుంది. నిర్మాతల సమకారం లేకుండా ఇలా రిచ్ నెస్ వచ్చేదికాదు. అలాగే ఫిలింసిటీలో కూడా కొంత పార్ట్ తీశారు.

‘ఓం భీమ్ బుష్’  టైటిల్ పెట్టడానికి కారణం?

అసలు కథగా అనుకున్నప్పుడు ముందుగా ఈ టైటిల్ అనుకోలేదు. కానీ రానురాను షూటింగ్ చేస్తుండగా, మా ముగ్గురి మధ్య వుండే రాపోతో ఈనాటి ట్రెండ్ కు తగినట్లు మాట్లాడే భాషతో షడెన్ గా పుట్టిన టైటిల్ ‘ఓం భీమ్ బుష్’. ఇలాంటి పదం గతంలో మనం చాలాసార్లు వినేవాల్ళం. చాలా కేచీగా వుంటుందనిపించింది. అలాగే ఈ సినిమాకు టైటిల్ ఓ ఎసెట్ గా అనిపించింది.

ఈమధ్య ప్రమోషన్ లో భాగంగా టూర్ లు వెళ్ళారు. స్పందన ఎలా వుంది?

నేను వైజాగ్ కు వేరే షూట్ లో వుండడం వల్ల వెళ్ళలేకపోయా. హైదరాబాద్ లో ట్రైలర్ అప్పుడు కానీ, మిగిలిన చోట్ల కానీ అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. యూత్ ఆడియన్స్ మమ్మల్ని చూడగానే ఎంతో ఎంజాయ్ చేస్తూ గత సినిమాలతో పోలుస్తూ పలకరించడంతో మాపై మాకు మరింత బాధ్యతగా అనిపించింది.

యూత్ సినిమాలలో డైలాగ్ లు కొంచెం గాడి తప్పుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.? దీనిపై మీరేం మంటారు?

సహజంగా యూత్ బయట మాట్లాడుకునే మాటలే సహజత్వం కోసం సినిమా పరంగా కథపరంగా కొన్నిడైలాగ్స్ లు అలా వస్తుంటాయి. కానీ ఎక్కడా అసభ్యతకు తావులేకుండా వుంటాయి.

గతానికి వర్తమానికి మీలో కలిగిన మార్పులు ఏమిటి?

నేను పెళ్లిచూపులు టైంలో టీనేజ్ లో వున్నాను. ఆ తర్వాత సినిమా సినిమాకూ వస్తున్న రెస్సాన్స్ చూసి నాలోతెలీని మార్పు గమనించాను. మంగళవారం తర్వాత నాలో తెలీని మార్పు కనిపించింది. ఆమధ్య  షూటింగ్ లో భాగంగా బయటకు వెలితే.. మీరు సినిమా వాల్ళా.. ఆర్.ఆర్.ఆర్.. సినిమా వాళ్ళే కదా.. అంటూ ఆ సినిమాను కంపేర్ చేస్తూ తెలుగు సినిమా వారిలో ఎంత కనెక్ట్ అయిందో మాకు అర్థం అయింది.  బయట ప్రేక్షకులు మనల్ని ఇంతగా గుర్తుపెట్టుకున్నారంటో మరింత బాధ్యతగా వుండాలని చాలా నాకు నేను మార్చుకున్నాను.

దర్శకుడు హర్ష గురించి చెప్పండి?

తను టాలెంట్ దర్శకుడు. హర్ష నాకు 12 ఏళ్ళుగా తెలుసు. హుషారు ముందు సినిమా చేయాల్సింది కుదరలేదు. రౌడీబాయ్స్ టైంలలో కథ చెప్పాడు. అదీ కుదరలేదు. ఇప్పుడు మూడోసారి కుదిరింది.

రాహుల్ రామక్రిష్ణ, శ్రీ విష్ణు ఇలా మీ ముగ్గురు కెరీర్ చూస్తే ఏమనిపిస్తుంది.

రాహుల్  12 ఏళ్ళుగా తెలుసు. శ్రీ విష్ణుతో ఉన్నది ఒక్కటే జిందగీ నుంచి తెలుసు. స్నేహితులతో కలసి సినిమా చేస్తున్నపుడు ప్రతి క్షణం మెమరబుల్ గానే వుంటుంది. మా ముగ్గురికీ ఒకే పోలిక వుంది. మేం ఇండస్ట్రీలో స్వయంగా ఎదిగాం. అలా సినిమా రంగం మమ్మల్ని ప్రోత్సహించింది. ఇందుకు ఆడియన్స్ కు మన్సూర్తిా క్రుతజ్జతలు తెలియజేసుకుంటున్నాం.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. అలాగే గేమ్ ఛేంజర్ లో కూడా నటిస్తున్నాను.