అమృతరామమ్ డైరెక్ట్ రిలీజ్

Published On: April 28, 2020   |   Posted By:
 అమృతరామమ్ డైరెక్ట్ రిలీజ్
 
ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 29న అమృతరామమ్ డైరెక్ట్ రిలీజ్ 

ప్రపంచంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోన మహమ్మారి విజృంభిస్తుంది.
ఈ క్రమంలో థియేటర్స్ మూతపడ్డాయి. అందుచేత ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ
ప్లాట్‌ఫాంలో సినిమాలు వీక్షిస్తున్నారు. అందులో భాగంగా అమృతరామమ్ మొదటి
తెలుగు సినిమాగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రానుంది.

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా సురేందర్‌ కొంటడ్డి
దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం అమృతరమమ్. లాక్ డౌన్
కారణంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు జీ5 యాప్ లో ఏప్రిల్ 29న విడుదల
చేయనున్నారు. ఇంటోనే ఉండి ప్రేక్షకులు అమృతరామమ్ సినిమా స్పెషల్
ప్రీమియర్ ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారు.

ప్రేమ కోసం పరితపించే అబ్బాయిల కథలను వెండితెరపై మనం చూశాం. అయితే, ఇది అలాంటి ఒకమ్మాయి ప్రేమకథ ఈ అమృతరామమ్, ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు సురేందర్‌ కొంటాడ్డి.