అల్లంత దూరాన చిత్రం పాట విడుదల

Published On: May 4, 2022   |   Posted By:

అల్లంత దూరాన చిత్రం పాట విడుదల

ఇంజినీరింగ్ కాలేజీలో “అల్లంత దూరాన” పాట విడుదల

“అల్లంత దూరాన” చిత్రంలో హుషారుగా సాగే ఓ యూత్ ఫుల్ పాటను హైదరాబాద్ లోని ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీ లో వేలాదిమంది స్టూడెంట్స్ మధ్యన విడుదల చేశారు. ఈ పాటకు రాంబాబు సాహిత్యాన్ని అందించగా, రధన్ సంగీతాన్ని సమకూర్చారు. . గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే గువ్వల గుంపే మనమైపోదాం …” అంటూ సాగే పాటను వేలాదిమంది స్టూడెంట్స్ కరతాళ ధ్వనుల మధ్యన విడుదలయ్యింది. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ, “ఈ పాటను ఈ కాలేజీలో ఇంతమంది అధ్యాపక, స్టూడెంట్స్ మధ్యన విడుదల కావడం చాలా వండర్ ఫుల్ గా ఉంది. యూనిట్ సమష్టి కృషితో చాలా మంచి సినిమాను తీశారు. మీ యోత్ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, “వాస్తవానికి దగ్గరగా మీ స్టూడెంట్స్ అందరి జీవితంలో జరిగే విషయాలే ఈ చిత్రంలో ఉంటాయి. పాటలన్నీ అలరిస్తాయి. రధన్ సంగీతం వీనులవిందుగా ఉంటుంది..చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, స్క్రీన్ పై మిమ్మల్ని మీరే చూసుకున్న భావనతో ఈ చిత్రం ఉంటుంది. సినిమాతో పాటలన్నీ వేటికవే హైలైట్ గా ఉంటాయి. ఈ పాట చాలా ఎనర్జిటిక్ గా అలరిస్తుంది. హీరో, హీరోయిన్లు తమ పాత్రలలో ఎంతోబాగా ఒదిగిపోయారు’ అని అన్నారు.
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, కళ్లతో రొమాన్స్ ను వ్యక్తం చేస్తూ ఓ మధురానుభూతిని కలిగించేవిధంగా ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్టూడెంట్స్ అంతా ఓ టూర్ కు వెళ్ళినప్పుడు వారి మనసు ఎంత ఉల్లాసంగా అనిపిస్తుందో ఈ పాట కూడా అలానే ఉంటుంది అని అన్నారు.
హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, స్టూడెంట్స్ జీవితానికి దగ్గరగా ఎంతో ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం మలచబడింది. ఇలాంటి సినిమాలో నటించండం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ తోపాటు పలువురు స్టాఫ్ పాల్గొన్నారు.