అవతార్-2 తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ అవసరాల

Published On: December 13, 2022   |   Posted By:

అవతార్-2 తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ అవసరాల

Image

జేమ్స్ కామెరూన్ అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ అవసరాల

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్ కామెరూన్ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు.

అవతార్ 2 ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా అవతార్ 2 సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ఏమిటంటే తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది.

అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ విజువల్ గ్రాండియర్ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.