ఆదిపురుష్ మూవీ రివ్యూ

Published On: June 16, 2023   |   Posted By:

ఆదిపురుష్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

గత కొద్ది రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. ఆ క్షణాలు వచ్చేసాయి. ఆదిపురుష్ వెండి తెరపై దర్శనమిచ్చారు. అయితే ఆ రాముడు ఎక్సపెక్టేషన్స్ కు తగ్గట్లు ఉన్నాడా.
ఈ ఆదిపురుష్ లో కొత్తగా చెప్పిందేమిటిచూపిందేమిటిదేశాన్ని భక్తిరసంలో ముంచెత్తే సినిమా అవుతుందాఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ :

రాఘవ (ప్రభాస్) వనవాసం స్వీకరించడంతో మొదలయ్యే ఈ కథ శూర్పణఖ ఆయన్ని మోహించటం దగ్గర నుంచి మలుపు తిరుగుతుంది. శూర్పణఖను రాఘవ వెనక్కి వెళ్లిపొమ్మనటంతో ఆమెకు కోపం వస్తుంది. దాంతో తన అన్నలంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్) ని రెచ్చగొడుతుంది. ఆ క్రమంలో తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలు విని జానకిని మోహంచి అపహరిస్తాడు. లంకకు తీసుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. బంగారు లేడి నెపంతో తనను దూరం పెట్టి లంకేష్ తన తన జానకినిని ఎత్తుకుపోయారని తెలుసుకున్న రాఘవ, ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు ఏం చేశాడు? లంకేష్ పై ప్రకటించిన యుద్దంలో భజరంగి ఎలాంటి సాయం చేసాడుచివరకు చెడుపై మంచి ఎలా గెలిచిందన్నది మిగతా కథ.

ఎనాలసిస్ :

ప్రతీ తరానికి మన పురాణ,ఇతిహాసాలు,చరిత్ర గురించి చెప్పాల్సిన భాధ్యత కళాకారులపై ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ క్రమంలో మూలం వదిలేసి కల్పనలకు ఎక్కువ అవకాసం ఇవ్వకూడదు. మోడ్రన్ పేరుతో మొత్తం మార్చేయకూడదు. అదే జరిగింది ఈ సినిమాకు. థీమ్ రామాయణంలోది తీసుకుని పాత్రల నామ,రూపాలు మొత్తం మార్చేసే పని పెట్టుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఉత్తరాది దర్శకుడు అవటంతో ఇక్కడ మన సెన్సబులిటీస్ కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు. కేవలం రాముడుని థీరోదాత్తుడుగాయుద్ద వీరుడుగా చూపాలనే తపనే అడుగడుగునా కనిపిస్తుంది. అందులో తప్పేమి లేదుఓ కొత్త కోణాన్ని చూపెట్టాలనే దర్శకుడు తాపత్రయమూ అభినందించదగినదే. అయితే అందుకు ఎంచుకున్న స్క్రీన్ ప్లే కానీ, రావణుడు సన్నివేశాలు కానీ, సెకండాఫ్ లో వచ్చే యుద్ద సన్నివేశాలు కానీ వర్కవుట్ కాలేదు. అదే కనుక వర్కవుట్ అయ్యి ఉంటే ఆదిపురుష్ ఆదిఅంతం లేకుండా కొంతకాలం పాటు ఊపేదే. అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడు భక్తి రస చిత్రంగా ప్రమోట్ చేసారు కానీ సినిమాలో ఆ ఛాయిలు ఏమీ లేవు. కేవలం రాముడు తన భార్యను ఎలా వెనక్కితెచ్చుకున్నాడనేదే ప్రధానాంశం అయ్యిపోయింది. ఈ క్రమంలో రాముడు,సీత మధ్య ఎమోషన్ బాండింగ్ ఏర్పాటు చేయలేకపోయారు.అలాగే రావణుడుపై మనకి కోపం తెప్పించలేకపోయారు.రావణుడు చేసింది పెద్ద తప్పుగా అనిపించేలా సీన్స్ డిజైన్ చేయలేకపోయారు.అవే సినిమాని వెనక్కి లాగేసాయి.

ఎవరెలా చేసారంటే :

ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసాడనే చెప్పాలి. అయితే లుక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. బాగా ఒళ్లు వచ్చినట్లు కనపడుతున్నాడు. ఇక జానకీ దేవిగా కృతి సనన్ బాగానే నప్పింది. ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో ఎక్సప్రెషన్స్ బాగా పండాయి. కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. శేషుగా సన్నీ సింగ్ పర్వాలేదనిపించుకున్నాడు. భజరంగ్ పాత్రలో దేవ్ దత్తా అదరకొట్టాడు. ఇక రావణ్ గా సైఫ్ అలీఖాన్ నటన, బాడీ లాంగ్వేజ్, రావణుడు అవెంజర్స్ లో తానోస్ రేంజ్ లో ప్రొజెక్ట్ చేయాలని అనిపించటమే బాగోలేదు.

టెక్నికల్ గా:

టెక్నికల్ గా బాగా కష్టపడ్డారంటే రిఫరెన్స్ లు పెట్టుకున్నవి సరైనవి పెట్టుకోలేదు. వానర సైన్యం చూస్తే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లో వానరాలు గుర్తుకు వచ్చినప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది. లంకలో రావణుడి సైన్యం చూస్తే ఈవెల్ డెడ్ లో దెయ్యాలను చూసినట్టు ఉంటాయి. రావణుడు పది తలలు VFX లో దారుణంగా కార్టూన్స్ లాగ ఉంన్నాయి. డైలాగులలో డబ్బింగ్ వాసన కనపడింది. కెమెరా బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ పై దృష్టి పెడితే బాగుండేది. జై శ్రీరామ్, శివోహం, ప్రియమిథునం పాటలు, బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్.

చూడచ్చా:

ఈ జనరేషన్ పిల్లలకు ఈ సినిమా నచ్చవచ్చు. పాతవాళ్లందరూ గతంలో వచ్చిన సినిమాలు చూసి వాటితో పోల్చి పెదవి విరుస్తారు.

నటీనటులు :

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు

సాంకేతికవర్గం :

మూలకథ : వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా
మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో)
పాటలు : రామజోగయ్య శాస్త్రి
ఛాయాగ్రహణం : కార్తీక్ పళని
నేపథ్య సంగీతం : సంచిత్ – అంకిత్
స్వరాలు : అజయ్ – అతుల్, సచేత్ – పరంపర!
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్
విడుదల : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (తెలుగులో)
దర్శకత్వం : ఓం రౌత్
రన్ టైమ్ : 179 మినిట్స్
విడుదల తేదీ: జూన్ 16, 2023