ఆది పినిశెట్టి చిత్రం చివ‌రి షెడ్యూల్‌ ఆగ‌స్ట్‌లో

Published On: July 15, 2019   |   Posted By:

ఆది పినిశెట్టి చిత్రం చివ‌రి షెడ్యూల్‌ ఆగ‌స్ట్‌లో

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ రొమెడీ 

`హైద‌రాబాద్ బ్లూస్‌`,`ఇక్బాల్‌` వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేశ్ కుకునూర్‌. ఈయ‌న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.

స్పోర్ట్స్ రొమెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

న‌టీన‌టులు:
కీర్తిసురేశ్‌
ఆది పినిశెట్టి
జ‌గ‌ప‌తిబాబు
రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం:  న‌గేశ్ కుకునూర్‌
స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు(శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌
నిర్మాత‌:  సుధీర్ చంద్ర‌
కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రావ్యా వ‌ర్మ‌
మ్యూజిక్‌:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ:  చిరంత‌న్ దాస్‌