ఆపరేషన్ రావణ్ సినిమా పాట విడుదల

Published On: August 12, 2023   |   Posted By:

ఆపరేషన్ రావణ్ సినిమా పాట విడుదల

ఆపరేషన్ రావణ్ సినిమా నుంచి చందమామ కథలోన పాట ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆపరేషన్ రావణ్. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్ పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. టీమ్ కు తన ఆశిస్సులు అందజేశారు

శరవణ వాసుదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా హరి చరణ్, గీతామాధురి పాడారు. చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట.

ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆపరేషన్ రావణ్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు :

రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

సాంకేతిక బృందం :

సంగీతం: శరవణ వాసుదేవన్
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య